
తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ ప్రవేశం కేసీఆర్ ను దెబ్బకొట్టడానికేనా..? రాజన్న రాజ్యం నినాదంతో హడావుడి చేస్తున్న షర్మిల టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ గా ముందుకు సాగుతోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రవేశంతో వైఎస్ జగన్ కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనే అనుమానం కలుగుతోంది. 2019 ఎన్నికల ముందు ఏపీ తెలంగాణ మధ్య రిటర్న్ గిఫ్ట్ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కు మద్దతుగా టీడీపీ ప్రచారం చేసింది. ఆ విషయాన్ని తరువాత ప్రస్తావించిన కేసీఆర్ తానూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటన చేశారు. అప్పట్లో ఈ అంశం సంచలనం అయ్యింది.
Also Read: వైఎస్ షర్మిల టార్గెట్ వారేనా..?
తరువాత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. రిటర్న్ గిఫ్ట్ అంశం కొంతకాలం పాటు చర్చకొచ్చినా.. తరువాత మరుగున పడిపోయింది. అలాంటిదిప్పుడు షర్మిల కారణంగా మళ్లీ రిటర్న్ గిఫ్ట్ అంశం పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. అయితే తాజా రిటర్న్ గిఫ్ట్ విషయంలో మాత్రం రెండు రకాలుగా చర్చ జరుగుతోంది. మొదటిదేమో.. బీజేపీ .. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు కేసీఆర్ జగన్ కలిసి షర్మిలను రంగంలోకి దింపారన్నది ఒక చర్చ.
Also Read: సాగర్ బరిలో టీడీపీ..
ఇదే సమయంలో షర్మిల పార్టీ పెట్టే విషయంలో జగనుకు సంబంధం లేదని ఆమె సొంతంగా నిర్ణయం తీసుకుందని మరో వాదన. అయితే చర్చ ప్రకారం అయితే కేసీఆర్ కు సాయం అందించేందుకు జగన్ షర్మిల పార్టీ రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చర్చ జరుగుతోంది. ఇక రెండో పద్ధతిలో అయితే చివరికి కేసీఆర్ ను కూడా దెబ్బ కొడతారనే చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
అంటే ఇక్కడ కేసీఆర్ కు జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనే అర్థం. ఒక్కోసారి మనం ఏదో ఆలోచనలో ఓ పని మొదలు పెడతాం. కానీ మనం అనుకున్న పని గ్రౌండ్ అయిన తరువాత పరిస్థితులను బట్టి అనుకున్న దానికన్నా భిన్నంగా వెళ్తుంది. చివరికి తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల కొత్తపార్టీతో అడుగుపెట్టడం కూడా అలాగే జరిగిపోయిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.