అయినా.. తెలంగాణతో ఫ్రెండ్ షిప్ యేనన్న జగన్

ఉమ్మడి ప్రాజెక్టుల్లోని నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరిట వృథా చేస్తూ సముద్రంలోకి పంపిస్తున్న తెలంగాణపై నిన్ననే ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు జగన్.ఏపీ సాగు, తాగునీటికి ఇబ్బందులు కలుగుచేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాలను ప్రాజెక్టులపై మోహరించాలని సూచించారు. అయితే ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్ మాట మార్చేశారు.కాస్త బెండ్ అయిపోయారు. ఎంత గిల్లికజ్జాలు పెట్టుకున్నా సరే.. తెలంగాణ సహా పక్క రాష్ట్రాలతో తాము సఖ్యత కోరుకుంటున్నామని అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం […]

Written By: NARESH, Updated On : July 8, 2021 5:04 pm
Follow us on

ఉమ్మడి ప్రాజెక్టుల్లోని నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరిట వృథా చేస్తూ సముద్రంలోకి పంపిస్తున్న తెలంగాణపై నిన్ననే ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు జగన్.ఏపీ సాగు, తాగునీటికి ఇబ్బందులు కలుగుచేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాలను ప్రాజెక్టులపై మోహరించాలని సూచించారు.

అయితే ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్ మాట మార్చేశారు.కాస్త బెండ్ అయిపోయారు. ఎంత గిల్లికజ్జాలు పెట్టుకున్నా సరే.. తెలంగాణ సహా పక్క రాష్ట్రాలతో తాము సఖ్యత కోరుకుంటున్నామని అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. గతంలో సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా ఉందనే విషయం వారికి తెలిసిందే.. జలాల కేటాయింపులో గతంలో ఒప్పందాలు జరిగాయి.. కోస్తాకు 360 టీఎంసీలు, సీమకు 144 టీఎంసీలు, తెలంగాణకు 290టీఎంసీలు కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించారు. అయితే ఇప్పుడు ఎందుకు తెలంగాణ పేచీలు పెడుతోందని జగన్ విమర్శించారు.

శ్రీశైలంలో 881 అడుగులకు నీళ్లు చేరితే తప్ప కిందకు నీళ్లు తీసుకురాలేమని.. సీమ ఎత్తిపోతలకు 881 అడుగుల్లో లిఫ్ట్ పెట్టి వాడుకుంటే తప్పేముందని జగన్ ప్రశ్నించారు. తెలంగాణలో కల్వకుర్తి, సామర్థ్యాన్ని పెంచి చేపడుతున్నారని అది తప్పు కాదా? అని జగన్ ప్రశ్నించారు.

రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని.. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని జగన్ సంచలన ప్రకటన చేశారు. పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల్లో ఎంతగా రచ్చచేసినా.. ఇబ్బంది పెట్టినా కూడా ఆ రాష్ట్రంతో కయ్యానికి కాలుదువ్వం అని జగన్ చెప్పకనే చెప్పారు.