
రాష్ట్రంలో బీజేపీతో ఫైట్ చేస్తూ కేంద్రంలోని బీజేపీతో చెలిమి చేస్తున్నారు ఏపీ సీఎం జగన్.తనపై నమోదైన కేసుల ప్రభావమో లేక రాష్ట్ర అవసరాలో కానీ మోడీని తిట్టిన జార్ఖండ్ సీఎంకు ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం మధ్యాహ్నం మోడీని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అకస్మాత్తుగా స్పందించడం రాష్ట్ర రాజకీయ పరిశీలకులకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది.
గురువారం రాత్రి కోవిడ్-19 పరిస్థితులపై కేంద్రం నుంచి రాష్ట్రాలకు అవసరాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. పీఎం మోడీ హేవింత్ సోరెన్‌తో రాష్ట్ర కోవిడ్ -19 పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఫోన్ సంభాషణ తరువాత సోరెన్ ట్విట్టర్‌లోకి విమర్శలు గుప్పించారు. పీఎం మోడీ ప్రసంగం “మన్ కి బాత్” మాత్రమే అని ఎద్దేవా చేశారు. “మోడీ తమ రాష్ట్ర సమస్యలపై వినలేదని.. ఆయనే మాట్లాడాడని మా బాధ వింటే బాగుండేది” అని ముఖ్యమంత్రి సోరేన్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ హిందీలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకులు మోడీకి తెలియజేయాలని కోరుకునే సందేశాన్ని పంపించేవారు. ఇది పూర్తిగా మోడీ సాయం చేయడం లేదని విమర్శిస్తూ సోరెన్ నుంచి వచ్చిన వ్యక్తిగత వ్యాఖ్య. మోడీని విమర్శించిన జార్ఖండ్ సీఎంపై ఆశ్చర్యకరంగా ఏపీ సీఎం జగన్ శుక్రవారం మధ్యాహ్నం కౌంటర్ ఇవ్వడం సంచలనమైంది.
సీఎం జగన్ ట్వీట్ చేశారు.“ప్రియమైన సీఎం హేమంత్ సొరెన్. మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఒక సోదరుడిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మా విభేదాలు ఏమైనప్పటికీ దేశం ఇంతటి కరోనా కల్లోలంలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం మన దేశాన్ని బలహీనపరుస్తుంది’ అని జగన్ కౌంటర్ ఇచ్చారు.
కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగిన ఈ యుద్ధంలో మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి విమర్శలు చేయడం మాని కలిసి సాగి మన ప్రధానమంత్రికి అండగా నిలవాలి అని జగన్ పేర్కొన్నారు. జార్ఖండ్ సీఎం వ్యాఖ్యపై మోడీ కాకుండా జగన్ ఇంత తీవ్రంగా స్పందించడం ఆశ్చర్యంగా ఉంది. అన్నింటిలో మొదటిది సోరెన్ ఆంధ్రప్రదేశ్‌ను మినహాయించి మరే ఇతర రాష్ట్రాల గురించి ప్రస్తావించలేదు.
రెండోది ట్వీట్ పూర్తిగా హిందీలో ఉంది.. జగన్ కు హిందీలో తగినంత ప్రావీణ్యం లేదు. అయినా కూడా కౌంటర్ ఇవ్వడం అందరినీ షాక్ కు గురిచేసింది. మూడోది.. ఇది ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకున్న సందేశం. జగన్ దానిపై స్పందించడానికి ఎటువంటి కారణం లేదు.
“ఇది జగన్ నుండి ఆకస్మిక ప్రతిచర్యగా భావిస్తున్నారు. లేదా సోరెన్ పై దాడి చేయడానికి ఢిల్లీ నుంచి ఏదైనా సందేశం వచ్చిందా అనేది ఖచ్చితంగా తెలియదు. కానీ ఖచ్చితంగా దీనికి కొంత రాజకీయ ప్రాముఖ్యత ఉంది, ”అని ఢిల్లీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
మోడీపై సడెన్ గా జగన్ కు ఇంత ప్రేమ రావడం.. కేసుల భయమా? లేక భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవమా? అన్నది తెలియదని సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ ఇలా మోడీపై ఈగవాలనీయకుండా కాపు కాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Dear @HemantSorenJMM,
I have great respect for you, but as a brother I would urge you, no matter what ever our differences are, indulging in such level of politics would only weaken our own nation. (1/2) https://t.co/0HZr56nOj2— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2021