LIC Policy: మనలో చాలామంది ఎల్‌ఐసీ పాలసీలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ఎల్‌ఐసీ పాలసీలు ఉండగా కొన్ని పాలసీలు మాత్రమే మంచి బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి. ఎల్‌ఐసీ పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటి కాగా ఈ పాలసీని తీసుకోవడం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ ను పొందవచ్చు. రోజుకు కేవలం 60 రూపాయలు పొదుపు చేయడం ద్వారా ఈ పాలసీ తీసుకున్న వాళ్లు 13 లక్షల రూపాయలు పొందవచ్చు.
ఈ పాలసీ నాన్ లింక్డ్ స్కీమ్ కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు రక్షణతో పాటు రాబడి కూడా లభిస్తుంది. ఈ పాలసీ ని తీసుకున్న వాళ్లకు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఈ పాలసీ టర్మ్ 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉండగా 8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు.
Also Read: LIC Policy For Elders: వృద్ధులకు ఎల్ఐసీ శుభవార్త.. సంవత్సరానికి రూ.లక్షకు పైగా పెన్షన్!
కనీసం 2 లక్షల రూపాయల నుంచి ఎంత మొత్తానికైనా పాలసీని తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ ను బట్టి ప్రీమియం చెల్లించాల్సిన సంవత్సరాల విషయంలో మార్పు ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు బోనస్, ఫైనల్ అడిషన్ బోనస్, బీమా మొత్తం లభిస్తాయి. 30 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు 25 ఏళ్ల టర్మ్ కు పాలసీని తీసుకుంటే 16 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించి మెచ్యూరిటీ తర్వాత 13 లక్షల రూపాయలు పొందవచ్చు.
సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి జీవన్ లాభ్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ పాలసీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ ఏజెంట్ల ద్వారా కూడా ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: LIC Credit Card: ఎల్ఐసీ పాలసీదారులకు ఫ్రీగా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలంటే?