
Jagan Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మారుతున్నాయి. రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు కూడా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ర్టపతిని కోరారు. దీంతో పరిస్థితులు ఎలా మారతాయోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగనున్న రాష్ర్ట కేబినెట్ సమావేశంపై అందరి దృష్టి పడింది.
సీఎం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో తీసుకోబోయే నిర్ణయాలపై ఇప్పటికే జగన్ పలు సూచనలు చేశారు. రాజకీయ అంశాలపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో రాష్ర్ట పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంి.
కేబినెట్ ఎజెండాలో టీటీడీ పాలక మండలి సభ్యు ల వ్యవహారంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రభుత్వం 52 మందితో కార్యవర్గం నియామకంపై పలువురు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేబినెట్ లో దీనిపై చర్చించేందుకు నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం నియమించిన కార్యవర్గం సరైనదే అని చెప్పేందుకు తీర్మానం చేసేందుకు ప్రధానంగా చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అందరిలో ఆసక్తి నెలకొంది. రైతుల సమస్యలు, కరోనా పరిస్థితులపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఏర్పడింది. కాగా ఇదే చివరి కేబినెట్ సమావేశంగా చెబుతున్నారు. దీంతో ఏపీ కేబినెట్ సమావేశంపై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి.
Also Read: మధ్యంతర ఏపీ కేబినెట్ మార్పు: జగన్ నిర్ణయం సరైందేనా?