https://oktelugu.com/

జియోలో 200 ఉద్యోగ ఖాళీలు.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ తో..?

కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రముఖ టెలీకాం సంస్థలలో ఒకటైన జియోలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 200 ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి 12,500 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 22, 2021 / 11:02 AM IST
    Follow us on

    కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రముఖ టెలీకాం సంస్థలలో ఒకటైన జియోలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 200 ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

    ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి 12,500 రూపాయలు వేతనం లభిస్తుంది. https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్ లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలు వచ్చిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

    19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్, ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ లను కచ్చితంగా కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 8179541641 నంబర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

    ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ తో పని చేయాల్సి ఉంటుంది. ఏపీకి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.