https://oktelugu.com/

CM Jagan: జగన్ మాస్టర్ స్ట్రోక్.. బాబుకు ‘బొమ్మ’ కనబడిందిగా..!

CM Jagan Master Stroke: వైఎస్ జగన్మోహన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు వరుసబెట్టి స్ట్రోకుల మీద స్టోకులు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రజావేదిక కూల్చివేసి టీడీపీకి సీఎం జగన్మోహన్ గట్టి సంకేతాలను పంపించారు. అక్కడి మొదలైన వార్ నేటికి కొనసాగుతూనే ఉంది. జగన్ ముప్పేట దాడిని తట్టుకోలేక టీడీపీ నేతలంతా ఎక్కడికక్కడ సైలంట్ అయిపోయారు. ఇక టీడీపీ అధినేత బాబు అయితే ఏకంగా చిన్న పిల్లడిలా మీడియా బోరున ఏడ్చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో టీడీపీని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2022 / 12:34 PM IST
    Follow us on

    CM Jagan Master Stroke: వైఎస్ జగన్మోహన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు వరుసబెట్టి స్ట్రోకుల మీద స్టోకులు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రజావేదిక కూల్చివేసి టీడీపీకి సీఎం జగన్మోహన్ గట్టి సంకేతాలను పంపించారు. అక్కడి మొదలైన వార్ నేటికి కొనసాగుతూనే ఉంది. జగన్ ముప్పేట దాడిని తట్టుకోలేక టీడీపీ నేతలంతా ఎక్కడికక్కడ సైలంట్ అయిపోయారు. ఇక టీడీపీ అధినేత బాబు అయితే ఏకంగా చిన్న పిల్లడిలా మీడియా బోరున ఏడ్చేశారు.

    Andhra Pradesh CM

    మూడు రాజధానుల నిర్ణయంతో టీడీపీని ఒకే ప్రాంతానికి పరిమితం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో నిర్ణయంతో ఆపార్టీ ఉనికినే ప్రశ్నార్థకంలో పడేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు పేరును కొత్త జిల్లాకు పేరు పెట్టడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి బాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్లే కన్పిస్తోంది. ఈ ఒక్క నిర్ణయంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకేసారి నాలుగైదు పిట్టలను కొట్టాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేయలేని పనిని సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఎన్టీఆర్ కు వైసీపీ సరైన గౌరవం ఇవ్వడం ద్వారా బాబుకు చెక్ పెడుతూనే కమ్మ సామాజిక వర్గానికి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజికవర్గంపై కక్షకు దిగారన్న ఆరోపణలను టీడీపీ, జనసేన పార్టీలు బలంగా చేస్తున్నాయి.

    కమ్మ సామాజికవర్గం వారిని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలను గుప్పిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల అసెంబ్లీలో ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు సతీమణీ నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వైసీపీని ఇరుకున పెట్టింది. ఈ సంఘటన తర్వాత చంద్రబాబు మీడియా ముందు ఏడ్వడటం వంటి సంఘటనలు కమ్మవారంతా మళ్లీ టీడీపీ వైపు చూసేలా చేశాయి.

    అయితే వీటన్నింటికి జగన్ ఒక్క నిర్ణయంతో చెక్ పెట్టేశారు. ఎన్టీఆర్ పేరు కొత్త జిల్లాకు పెట్టడంతో అదే కమ్మ కులస్థులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. బాబు చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి చేశారంటూ కామెంట్స్ చేస్తుండటంతో ఇటీవల అసెంబ్లీలో జరిగిన విషయం సైతం మరుగునపడిపోయింది. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాగా సీఎం జగన్ నిర్ణయంపై ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.