https://oktelugu.com/

Mango Media: క్షమాపణలు చెప్పిన ‘మ్యాంగో వీడియోస్’

Mango Media: సింగర్ సునీత తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన భర్తతో హాయిగా ఉంది సునీత. అయితే, సునీత భర్త ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో వీడియోస్’ అధినేత అని తెలిసిందే. కాగా రామ్ వీరపనేని ఛానెల్ వివాదంలో చిక్కుకుంది. కొన్ని వీడియోల్లో గౌడ మహిళలను వేశ్యలుగా చూపించారంటూ గౌడ కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే మ్యాంగో వీడియోస్ కార్యాలయంపై దాడి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 28, 2022 / 12:44 PM IST
    Follow us on

    Mango Media: సింగర్ సునీత తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన భర్తతో హాయిగా ఉంది సునీత. అయితే, సునీత భర్త ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో వీడియోస్’ అధినేత అని తెలిసిందే. కాగా రామ్ వీరపనేని ఛానెల్ వివాదంలో చిక్కుకుంది. కొన్ని వీడియోల్లో గౌడ మహిళలను వేశ్యలుగా చూపించారంటూ గౌడ కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
    ఈ క్రమంలోనే మ్యాంగో వీడియోస్ కార్యాలయంపై దాడి కూడా జరిగింది.

    Singer Sunitha Ram

    కాగా తాజాగా రామ్ యూట్యూబ్ ఛానల్ మ్యాంగో వీడియో క్షమాపణలు చెప్పింది. యూట్యూబ్ ఛానల్‌ లో గౌడ మహిళలను కించపరిచేలా వీడియోలు పబ్లిష్ చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఎవర్నీ కించపరచడం తమ ఉద్దేశం కాదని, ఒకవేళ ఎవరైనా మనసు నొచ్చుకొని ఉంటే క్షమించాలని కోరుతూ సదరు సంస్థ లేఖ విడుదల చేసింది. ఆ వీడియోలను యూట్యూబ్ నుంచి ఇప్పటికే తొలగించినట్లు వెల్లడించింది. రామ్ వీరపనేని మంచి బిజినెస్ మ్యాన్. డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్.. ఒక విధంగా డిజిటల్ మీడియాలో మొఘల్ లాంటి వాడు. అందుకే ఆయనను ఇండస్ట్రీలో మ్యాంగో రామ్ అంటారు. రామ్ వీరపనేని ఆస్ట్రేలియాలో చదువుకుని ఇండియాకు వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు.

    Also Read:  కరోనా ముప్పు తొలగేలా లేదా? కేసులు తగ్గినా.. మరణాలు పెరిగాయి

     

    Sunitha and ram

    సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్‌ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. రామ్‌ వీరపనేని కూడా ఆమెకు పూర్తిగా సహకరిస్తున్నాడు. అన్నట్టు సునీత త్వరలోనే పాడుతా తీయగా తరహాలో ఒక సరికొత్త ప్రోగ్రాంతో తెలుగు లోగిళ్ళలోకి రాబోతుంది. దీనికి నిర్మాత రామ్ వీరపనేనినే. ఏది ఏమైనా సునీత గాత్రంతో తన చీర కట్టుతో ఆకట్టుకుంటుంది. మరి రామ్ వీరపనేని తాజాగా వివాదంలో చిక్కుకోవడం పై సునీత ఇంకా స్పందించలేదు.

    Also Read: NTR: జూనియర్ ఎన్టీఆర్ పై దాడికి దిగిన జగన్ మీడియా

    Tags