CM Jagan Meeting with MLAs: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సర్వేల భయం పట్టుకుంది. వైసీపీ అందరు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించడంతో అందులో సుమారు యాభై మంది పనితీరు బాగాలేదని నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అందరిలో ఇప్పుడు సర్వే ఫీవర్ వెంటాడుతోంది. మూడేళ్ల కిందట గెలిచిన వారికి ఇప్పుడు టికెట్ ఇవ్వాలా? వద్దా? అనే సందేహాలు జగన్ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలకు పదవి భయం పట్టుకుంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు కూడా ఉండటంతో మంత్రుల్లో సైతం తమ పదవి ఉంటుందో ఊడుతుందోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.

నిన్న జరిగిన వైసీపీఎల్ పీ సమావేశంలో ఈమేరకు జగన్ పలు నిర్ణయాలు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో తమ పనితీరు మార్చుకోకపోతే భవిష్యత్ ప్రశ్ణార్థకమే అని తెలుస్తోంది. దీంతో వారిలో నైరాశ్యం నెలకొంది. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే బూత్ కమిటీల్ని బలోపేతం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ప్రభుత్వానికి సహకరించాలని చెబుతున్నారు. సర్వేలో పాజిటివ్ గా పేరు వస్తేనే టికెట్లు కేటాయిస్తామని జగన్ చెబుతుండటంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. దీంతో రాష్ట్రంలో సర్వేల ఫీవర్ కొనసాగుతోంది.
Also Read: AP Politics: ఏపీలో ఆ యాభై మంది సీట్లు గల్లంతేనా?
ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్త పీకే ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో కొన్ని సవరణలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందుకే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తోంది. మంత్రి వర్గ విస్తరణ విషయంలో కూడా ఎమ్మెల్యేల పనితీరు ప్రామాణికంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

దీంతో రాబోయే రోజుల్లో ఇంకా పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. సర్వే రిపోర్టు అందుబాటులో ఉండటంతో ఎమ్మెల్యేల్లో భయం నెలకొంది. భవిష్యత్ పరిణామాలపై గందరగోళంలో పడిపోయారు. యాభై మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని తెలియడంతో ఇప్పటికైనా తమ పనితీరు మార్చుకోవాలని చెబుతున్నారు. రాబోయే కాలంలో సీటు పదిలం చేసుకోవాలంటే ప్రజల్లో మమేకం కావాల్సిందే. ఇందుకోసం ఇప్పటి నుంచైనా పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.
Also Read: Hijob: హిజాబ్ వివాదం.. ఎవరిది రైట్? ఎవరిది రాంగ్?
[…] ఒకవేళ కోమటి బ్రదర్స్ గనక కాంగ్రెస్‌ను వీడితే.. ఆ పార్టీ ఉమ్మడి నల్గొండలో పాతాలానికి పడిపోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లా నల్గొండ మాత్రమే. కాబట్టి వారిని కూడా దూరం చేసుకుంటే మాత్రం మరో పదేండ్లు వెనక్కు వెళ్లిపోతోంది. మరి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. Also Read: CM Jagan Meeting with MLAs: వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ స… […]