https://oktelugu.com/

ఆ ముగ్గురితో బాబుకు షాకిచ్చేందుకు రంగం సిద్ధం?

అధికారం బెల్లం లాంటిది.. దానికోసమే రాజకీయ నాయకులు పరితపిస్తారు. కేసీఆర్, చంద్రబాబు హయాంలో డైరెక్టుగా ఇతర పార్టీల నేతలకు మంత్రి పదవులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. కానీ వైఎస్ జగన్ మాత్రం కొన్ని నియమాలను రాజకీయాల్లో పెట్టుకున్నారు. రాజీనామా చేసి వస్తేనే తన పార్టీలోకి తీసుకుంటాడు. అదే ఇప్పుడు గోడ దూకే రాజకీయ నేతల ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. వారికి పదవుల దక్కకుండా చేస్తోంది. అందుకే ఇన్నాళ్లు ఓపిక పట్టిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 10, 2020 / 08:36 PM IST
    Follow us on


    అధికారం బెల్లం లాంటిది.. దానికోసమే రాజకీయ నాయకులు పరితపిస్తారు. కేసీఆర్, చంద్రబాబు హయాంలో డైరెక్టుగా ఇతర పార్టీల నేతలకు మంత్రి పదవులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. కానీ వైఎస్ జగన్ మాత్రం కొన్ని నియమాలను రాజకీయాల్లో పెట్టుకున్నారు. రాజీనామా చేసి వస్తేనే తన పార్టీలోకి తీసుకుంటాడు. అదే ఇప్పుడు గోడ దూకే రాజకీయ నేతల ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. వారికి పదవుల దక్కకుండా చేస్తోంది.

    అందుకే ఇన్నాళ్లు ఓపిక పట్టిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు సమయం వచ్చింది. చంద్రబాబుకు అదును చూసి షాకిచ్చేందుకు సీఎం, వైసీపీ అధినేత జగన్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.

    బ్రెజిల్ దేశాధ్యక్షుడిని కాపాడిన ఇండియన్ మెడిసిన్..!

    ప్రస్తుతానికి ముగ్గురి రాజీనామాలతో చంద్రబాబుకు షాకివ్వడానికి జగన్ రెడీ అయ్యారు. ఆ ముగ్గురిలో ఒకరికి మంత్రి పదవి కూడా ఇచ్చే యోచనలో జగన్ ఉన్నాడట.. దీంతో అటు చంద్రబాబును చిత్తుగా ఓడించొచ్చు.. ఇటు టీడీపీ బలాన్ని దెబ్బకొట్టి బలపడొచ్చు అని జగన్ స్కెచ్ వేశారట..

    టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తూ వైసీపీకి సపోర్టు చేస్తున్న రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాంలు ముగ్గురు రాజీనామాలకు సిద్ధం అయ్యారని తెలిసింది.. త్వరలోనే వారు రాజీనామాలు చేయడం.. స్పీకర్ ఆమోదించడం.. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరపడం ఖాయమని వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది. టీడీపీని చిత్తుగా ఓడించి ఆ ముగ్గురిని గెలిపించుకోవాలని సీఎం జగన్ ప్లాన్లు చేస్తున్నారట.. ఇందులో వల్లభనేని వంశీకి ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల్లో ఒక పదవిని ఇచ్చేందుకు కూడా జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

    కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేస్తున్న జగన్!

    ఈ ముగ్గురు నేతలూ టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుగా రాజకీయం చేశారనే అపవాదు ఉంది. దీంతో టీడీపీ నేతలు.. సోషల్ మీడియాలో వంశీ, కరణం, గిరిల రెండు నాల్కల ధోరణిపై విమర్శలు గుప్పించారు. వంశీ తిరగబడి టీడీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం శాసనసభలో టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీకి మద్దతు ప్రకటించిన వల్లభనేని వంశీ ఇప్పుడు ఆ టీడీపీ వాసనలు వదిలించుకోవాలని డిసైడ్ అవుతున్నాడట.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరుఫున గన్నవరంలో పోటీచేసి గెలిచి ఆ అపవాదును తుడుచుకోవాలని ఆలోచిస్తున్నాడట.. ఈ క్రమంలోనే సీఎం జగన్ ను ఒప్పించాలని సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.. వంశీతోపాటు కరణం, గిరి కూడా రెడీ కావడంతో మొత్తం ముగ్గురితో రాజీనామాలు చేయించి ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబును ఓడించి బుద్దిచెప్పాలని జగన్ డిసైడ్ అయ్యాడని సమాచారం.