https://oktelugu.com/

చైనా వెనక్కి వెళ్లినట్లు నమ్మిస్తుందా?

భారత్-చైనా సరిహద్దుల్లో కొంతకాలంగా ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. గాల్వానాలోయలో జూన్ 15న ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓవైపు శాంతి చర్చలంటూనే చైనా సరిహద్దుల్లో భారత జవాన్లపై దొంగదాడికి యత్నించింది. ఈ సంఘటనలో భారత్ జవాన్లు 21మంది వీరమరణం పొందారు. వెంటనే అప్రమతమైన భారత జవాన్లు చైనా సైనికులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. భారత ప్రతిదాడిలో చైనాకు చెందిన 43మంది మృతిచెందిననట్లు తెలుస్తోంది. చైనా సైనికులు ఎంతమంది చనిపోయారని లెక్కలు మాత్రం ఆ దేశం అధికారికంగా ప్రకటించలేదు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2020 / 08:23 PM IST
    Follow us on


    భారత్-చైనా సరిహద్దుల్లో కొంతకాలంగా ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. గాల్వానాలోయలో జూన్ 15న ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓవైపు శాంతి చర్చలంటూనే చైనా సరిహద్దుల్లో భారత జవాన్లపై దొంగదాడికి యత్నించింది. ఈ సంఘటనలో భారత్ జవాన్లు 21మంది వీరమరణం పొందారు. వెంటనే అప్రమతమైన భారత జవాన్లు చైనా సైనికులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. భారత ప్రతిదాడిలో చైనాకు చెందిన 43మంది మృతిచెందిననట్లు తెలుస్తోంది. చైనా సైనికులు ఎంతమంది చనిపోయారని లెక్కలు మాత్రం ఆ దేశం అధికారికంగా ప్రకటించలేదు. అయితే చైనాకు భారీగా నష్టం జరిగినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

    బ్రెజిల్ దేశాధ్యక్షుడిని కాపాడిన ఇండియన్ మెడిసిన్..!

    కరోనా మహమ్మరి విషయంలో ప్రపంచాన్ని ఎలా తప్పుదోవ పట్టించిందో అందరికీ తెల్సిందే. దొంగదెబ్బతీయడం, దొంగలెక్కలు చెప్పడం చైనాకు అలవాటేనని ప్రపంచ దేశాలు సైతం చైనా విమర్శిస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలో చైనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతు ప్రకటించాయి. చాలాదేశాలు బహిరంగంగానే భారత్ కు మద్దతు పలికాయి. భారత జవాన్లు మృతిపై కేంద్రం కూడా చాలా సీరియస్ అయింది. చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైంది.

    చైనాను రక్షణ, ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బతీసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితులను బట్టి నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కల్పించింది. త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. యుద్ధవిమానాలను సరిహద్దుల్లో గస్తీ ఉంచింది. మరోవైపు చైనాకు చెందిన పలు కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే చైనాకు చెందిన 59యాప్స్ ను భారత్ లో నిషేధించి చైనాకు షాకిచ్చింది.

    కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేస్తున్న జగన్!

    ఇటీవల భారత్ ప్రధాని లద్దాక్ లో పర్యటించిన చైనాకు గట్టివార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల్లో భారత జవాన్లకు ఆత్మస్థైర్యం కల్పించేలా ప్రసంగించారు. అనంతరం చైనా దాడిలో గాయపడిన భారత జవాన్లను పరామర్శించారు. మరోవైపు చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా తన సైన్యాన్ని వెనక్కి తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సరిహద్దుల్లో రెండుకిలోమీటర్ల వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే 1962 యుద్ధ సమయంలోనూ చైనా ఇలానే వెనక్కి వెళ్లి దొంగదెబ్బ తీసిందని ఆర్మీ అధికారులు చెబుతోన్నారు.

    చైనా నమ్మదగిన దేశంకాదని చెబుతున్నారు. సరిహద్దుల్లో వెనక్కి వెళ్లినట్లు నటించి మళ్లీ ఉద్రిక్తలు సృష్టిస్తుందటం కామన్ గా మారిందంటున్నారు. ఈనేపథ్యంలో భారత సైనికులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా లేకుంటే మూల్యం చెల్లించుకోవాలని వస్తుందని సూచిస్తున్నారు. ఈమేరకు భారత ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు సైనికులతో సమీక్షలు నిర్వహిస్తూ సరిహద్దుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుకుంటున్నారు.