https://oktelugu.com/

నా కోడ్‌ చెబితే 25 శాతం డిస్కౌంట్‌ ఇస్తారు.. సమంత

కరోనా దెబ్బకు షూటింగ్స్‌ ఆగిపోవడంతో సినీ ప్రముఖులు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. హైదరాబాద్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో సిటీలో ఉన్న వాళ్లు బయటికి అస్సలు రావడం లేదు. ఈ క్రమంలో తమకు తోచిన పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఖాళీ సమయం దొరికింది కాబట్టి కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను తరచూ పలుకరిస్తున్నారు. అలాంటి వాళ్లలో సమంత ముందుంది. తన భర్త నాగ చైతన్యతో వంట, వర్కౌట్స్‌, వాకింగ్‌, యోగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2020 / 08:42 PM IST
    Follow us on


    కరోనా దెబ్బకు షూటింగ్స్‌ ఆగిపోవడంతో సినీ ప్రముఖులు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. హైదరాబాద్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో సిటీలో ఉన్న వాళ్లు బయటికి అస్సలు రావడం లేదు. ఈ క్రమంలో తమకు తోచిన పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఖాళీ సమయం దొరికింది కాబట్టి కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను తరచూ పలుకరిస్తున్నారు. అలాంటి వాళ్లలో సమంత ముందుంది. తన భర్త నాగ చైతన్యతో వంట, వర్కౌట్స్‌, వాకింగ్‌, యోగా చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్ చేసిందామె. ఇప్పుడు బ్యూటీ టిప్స్‌ చెబుతోంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చే విటమిన్ ఇన్‌ఫ్యూషన్ థెరపీ గురించి వివరించింది. తాను ఈ థెరపీ చేయించుకున్న వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీని గురించి వివరించింది.

    కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేస్తున్న జగన్!

    ‘ఇప్పటిదాకా నేను కూకింగ్, గార్డెనింగ్‌ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నా అని తెలుకున్నా. అందుకే ఇప్పుడు మీ ముఖాన్ని ఎలా కాంతి వంతంగా మార్చుకోవాలో చెబుతున్నా చూడండి. ఫస్ట్‌ నా గ్లోయింగ్‌ స్కిన్‌ను నేను చాలా ఇష్టపడుతా. అందుకోసం విటమిన్‌ ఇన్ఫ్యూషన్‌ థెరపీ చేయించుకుంటా. దీనివల్ల ముఖం మెరిసిపోతుంది. దీన్ని నేను నెలకు గానీ రెండు నెలలకు ఒకసారి గానీ చేయించుకుంటా. ఇతరులకు ఎంతో కొంత మంచి చేసే విషయాన్నే చెబుతా. సో అంబ్రోసియా క్లినిక్‌లో నేను ఈ థెరపీ చేయించుకొని మంచి రిజల్ట్‌ పొందా. మీరు కూడా చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు ‘సమంత’ అనే కోడ్‌ చెబితే మీకు 25 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తారు. పదండి అందరం మెరిసిపోదాం’ అని సమంత రాసుకొచ్చింది.