AP Cabinet Expansion: సీఎం జగన్ అంటే వైసీపీలో సర్వాధినేత. ఇప్పటి వరకు ఆయన నిర్ణయాలే అంతిమంగా పార్టీలో పనిచేశాయి. ఆయన ఎవరికి కావాలంటే వారికి పదవులు ఇచ్చేవారు. ఎవరిని పక్కన పెట్టాలనుకుంటే పెట్టేశారు. కానీ ఇప్పుడు ఎందుకో ఆయనలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో అని తేలిపోయింది.
గతంలో మంత్రులందరినీ మార్చేస్తానని జగన్ తేల్చి చెప్పేశారు. ఇప్పటి వరకు అందరూ ఇదే నిజం కావచ్చు అనుకున్నారు. కానీ అందరినీ మార్చేందుకు జగన్ ధైర్యం చేయట్లేదు. కొన్ని సామాజిక వర్గాలతో పాటు ఇతర కారణాల వల్ల కొందరిని కొనసాగించవచ్చని, ఇంకొందరిని తొలగించవచ్చని జగన్ స్వయంగా చెప్పేశారు. ఇదే ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
Also Read: అయ్యయ్యో.. షర్మిల పాదయాత్రను ఎవరూ పట్టించుకోరే..!
గతంలో అందరినీ మార్చేస్తానని ధైర్యంగా చెప్పిన జగన్.. ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే మంత్రి పదవులు పోయిన వారు బాధపడొద్దంటూ జగన్ చెప్పడం ఇక్కడ విడ్డూరంగా ఉంది. అందరినీ తొలగిస్తే ఏ బాధ ఉండదు గానీ.. కొందరిని తీసేసి కొందరిని ఉంచితే మిగతా వారు బాధపడకుండా ఉంటారా.
మరి మంత్రి పదవి తీసేసి వారిని పార్టీలో పనిచేయాలంటే ఎవరైనా చేస్తారా.. తమ మంత్రి పదవిలో ఇతరులను కూర్చోబెట్టి తమను పార్టీలో పనిచేయాలంటే ఎవ్వరూ వినరు. గ్రూపు రాజకీయాలకు తెరతీస్తుంటారు. ఒకే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల మధ్య ఈ మంత్రి పదవుల ప్రక్షాళన కచ్చితంగా చిచ్చు పెడుతుంది. అయితే తనకు రాజకీయ సైన్యంలా ఉన్న కొందరిని మారిస్తే తనకు ప్రమాదమని జగన్ భావించనట్టు ఉన్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానితో పాటు మరికొందరు ఆయనకు బలమైన సైన్యంలా ఉన్నారు. కానీ ఒకప్పుడు జగన్ వీరిని నమ్ముకుని పార్టీని నడిపించలేదు. తన బుద్ధి బలం, వ్యూహాలతోనే నడిపించారు. కానీ ఇప్పుడు పార్టీ నేతలపై ఆయన పట్టు కోల్పోయినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన వెనకడుగు వేశారని అంటున్నారు చాలామంది.
Also Read: రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు..? వైసీపీ, బీజేడీతో బీజేపీ మంతనాలు?