https://oktelugu.com/

Radhe Shyam Box Office Collections: బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్

Radhe Shyam Box Office Collections:  ‘రాధేశ్యామ్’ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ సినీ లోకాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ప్రభాస్ ఫ్యాన్స్‌ కు మాత్రం పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ను అందించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘రాధేశ్యామ్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో అదరగొట్టింది. అలాగే సెకండ్ డే కూడా భారీ కలెక్షన్స్ ను […]

Written By:
  • Shiva
  • , Updated On : March 12, 2022 / 01:10 PM IST
    Follow us on

    Radhe Shyam Box Office Collections:  ‘రాధేశ్యామ్’ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ సినీ లోకాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ప్రభాస్ ఫ్యాన్స్‌ కు మాత్రం పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ను అందించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘రాధేశ్యామ్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో అదరగొట్టింది. అలాగే సెకండ్ డే కూడా భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది.

    Radhe Shyam

    ప్రపంచవ్యాప్తంగా 7000 స్క్రీన్ లలో విడుదల అయిన ‘రాధేశ్యామ్’ చాలా చోట్ల బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొదటి రోజు రూ.57 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. అదే విధంగా సెకండ్ డేన కూడా రూ.40 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టింది.

    Also Read: అక్కినేని ఫామిలీ సపోర్ట్ ఉన్న కూడా హీరో సుమంత్ స్టార్ గా ఎదగలేకపోవడానికి 5 కారణాలు ఇవే

    ఏపీ & తెలంగాణలో ‘రాధేశ్యామ్’ సెకండ్ డే కలెక్షన్స్ :

    నైజాం – 10.40 కోట్లు

    సీడెడ్ – 8.46 కోట్లు

    ఉత్తరాంధ్ర – 2.35 కోట్లు

    గుంటూరు – 3.70 కోట్లు

    ఈస్ట్ గోదావరి – 3.43 కోట్లు

    వెస్ట్ గోదావరి – 2.60 కోట్లు

    కృష్ణ – 2.51 కోట్లు

    నెల్లూరు – 4.56 కోట్లు

    Radhe Shyam Box Office Collections

    రెండో రోజు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం నిజంగా విశేషమే. బ్లాక్‌ బ‌స్ట‌ర్ ‘బాహుబ‌లి 2’ సినిమా కంటే కూడా ఈ చిత్రానికే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు చూసుకుంటే ఇప్పటివరకూ అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సిమిమా ‘రాధేశ్యామ్’ కావ‌డం విశేషం. ప్రస్తుతం మరో రెండు వారాలు వరకూ ఏ భారీ సినిమా రిలీజ్ కి లేకపోవడం ఈ సినిమాకు ఇంకా బాగా క‌లిసి రానుంది.

    ఏది ఏమైనా యంగ్‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ‘రాధేశ్యామ్’ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి… ఆ అంచనాలను చాలా తేలికగా అందుకుంది. సినిమాపై ఉన్న హైప్‌ ను చాలా ఈజీగా అందుకుంది. పైగా భారీ హైప్‌, సోలో రిలీజ్‌, విపరీతంగా చేసిన ప్ర‌మోష‌న్లు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.

    Also Read: షాకింగ్: రాధేశ్యామ్ 2వ రోజు కలెక్షన్లు తెలిస్తే మతి పోవాల్సిందే?

    Tags