https://oktelugu.com/

మిస్టరీ నేపథ్యంలో నితిన్ !

హీరో నితిన్ ఇప్పటికే వరుస సినిమాల్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందువరకూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో చిత్రం చేయనున్నాడు నితిన్. ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే ఆ టైటిల్ పెడుతున్నారట. ఆగష్టు నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. […]

Written By:
  • admin
  • , Updated On : June 11, 2020 / 04:38 PM IST
    Follow us on


    హీరో నితిన్ ఇప్పటికే వరుస సినిమాల్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందువరకూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో చిత్రం చేయనున్నాడు నితిన్. ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే ఆ టైటిల్ పెడుతున్నారట. ఆగష్టు నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి. ఈ సినిమా కూడా మిస్టరీ నేపథ్యంలోనే ఉంటుందట.

    ఇక నితిన్ లాస్ట్ సినిమా ‘భీష్మ’ భారి స్థాయిలో ఆకట్టుకోని సూపర్ హిట్ అయింది. దాంతో నితిన్, ఆ సక్సెస్ ను కొనసాగించాడానికి తన తదుపరి సినిమాల పై మరింత దృష్టి పెట్టారు. మరి ఈ ‘చదరంగం’ చిత్రంతో కూడా నితిన్ మరో సూపర్ హిట్ ఆయనకు దక్కుతుందేమో చూడాలి. అన్నట్టు ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు నితిన్.

    కాగా నితిన్ కొద్దిరోజుల క్రితం తన చిరకాల ప్రేయసి శాలినితో నిశితార్థం చేసుకున్నారు. మొదట నితిన్ దుబాయ్‌ లో ఏప్రిల్ 16న డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాలనుకున్నా… క‌రోనా కారణంగా అది కుదరలేదు. ఆ తరువాత త‌న పెళ్లిని డిసెంబ‌ర్‌ కు వాయిదా వేశారు. ఇక వివాహం హైదరాబాద్‌ లో వధువు ఇంటి వద్దే జరుగుతుందట.