
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిలోని ఒక కోణం మాత్రమే ప్రజలకు తెలుసు. ఆయనలోని మరో కోణం చాలా మందికి తెలియదు. జగన్ వైఎస్సార్ కుమారుడిగానే అందరికీ తెలుసు. ఇక ఆయన వైసీపీని స్థాపించి పోరాడి మరీ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒక సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గానే జనాలకు తెలుసు. కానీ.. పొలిటీషియన్ కాకముందే జగన్ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్. జగన్ వ్యాపార సామ్రాజ్యం గురించి ఆయన గురించి బాగా తెలిసిన వ్యాపారవేత్తలే చెబుతుంటారు. ఒక వ్యాపారవేత్త జన నేతగా మారడం అంటే గ్రేట్. జగన్ ఆ రేర్ ఫీట్‌ను సొంతం చేసుకున్నారు.
Also Read: ఏపీలో ఏకగ్రీవాల జోరు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించాలంటూ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ లేఖను ఓసారి పరిశీలిస్తే.. అందులో రాజకీయ విన్నపాలు కంటే కూడా ఒక విజయవంతమైన వ్యాపారవేత్త నష్టాలలో ఉన్న పరిశ్రమను ఎలా గట్టెక్కించవచ్చో తెలియచేసే విలువైన సూచనలు, సలహాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జగన్ స్టీల్ ప్లాంట్ వంటి సంస్థ లాభాల బాట చాలా తొందరలోనే పడుతుందని కూడా అంచనా వేశారు. దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటో కేంద్రానికి చెప్పారు. మరి ఇదే సీఎం సీట్లో మరొకరు ఉంటే మాత్రం ప్రైవేటీకరణ వద్దు అని మాత్రం విన్నవించేవారు కానీ ఎందుకు చేయరాదు అని ఇంత పక్కాగా చెప్పగలిగేవారు కాదని మేధావులు కూడా అంటున్నారు.
Also Read: విశాఖ స్టీల్ ఆందోళన.. పరిష్కార మార్గాలేంటి?
విశాఖ స్టీలు ప్లాంట్ కింద రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఉంది. ఆ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది ప్రజలకు ఉపాధి దొరుకుతోంది. విశాఖకు ఒక గర్వకారణం అయిన స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ కేంద్రం ప్రైవేటీకరణకే పట్టుపడితే మాత్రం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని కూడా జగన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. కచ్చితంగా స్టీల్ ప్లాంట్ తొందరలో లాభాల బాట పడుతుందని జగన్‌కు ఉన్న నమ్మకమే ఇందుకు కారణం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అలాగే.. విభజన హామీల మేరకు ఈ స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్రానికి వదిలేసి ప్లాంట్ తీసుకున్న రుణమొత్తం 22 వేల కోట్లను ఈక్విటీగా మార్చాలని కూడా జగన్ సూచిస్తున్నారు. విశాఖను పాలనారాజధానిగా చేస్తున్న జగన్‌కు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండడం చాలా ముఖ్యం. విశాఖ ముంగిటకు పాలనకు తీసుకోకముందే ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడం కూడా అవశ్యం. అయితే.. ఈ విషయంలో కేంద్రాన్ని ఎదిరించడం కంటే కూడా నచ్చచెప్పే ప్లాంట్ పరిరక్షణ జరిగేలా చూడాలని జగన్ అనుకుంటున్నారు. అందువల్ల జగన్ ప్లాన్ ఏ, బీ, సీలను కూడా రెడీ చేసుకున్నారని చెబుతున్నారు.