గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి తిరుగులేని ఆధిపత్యాన్ని అందించారు. కానీ ఈసారి అందులో చాలామంది భవితవ్యం ప్రశ్నార్థకమే అని తెలుస్తోంది. ఎందుకంటే చాలామంది సీనియర్లు ఉన్నారు. వారు ఇప్పటికే మూడు సార్లు వరుసగా గెలుస్తున్నారు. ఈ సారి వారిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సమాచారం. అందుకే వారిని పక్కన పెట్టాలని అధినేత జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వారిలో భయం పట్టుకుంది. పదవి లేకపోతే ఎలా అనే డైలమాలో పడిపోయే సూచనలు ఉన్నాయి. కానీ వారికి భరోసా ఇచ్చేందుకు వారిని పెద్దల సభకు పంపేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

అయితే వైసీపీ చేపట్టే సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథకాలు దాదాపు లేనట్లే. దీంతో ప్రజాప్రతినిధులకు ప్రజల్ని కలిసే అవకాశమే దక్కడం లేదు. దీంతో వారికి ప్రజాసంబంధాలు తక్కువైపోయాయి. దీంతో వారిని గుర్తుపట్టడం కూడా లేదని కొందరు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే వారిపై ప్రజల్లో వ్యతిరేకత రావడం మామూలే. దీంతో వారికి రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై సర్వే నిర్వహించి అందులో మంచి ఫలితాలు వస్తేనే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో కూడా ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి వ్యూహాలకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్లను పక్కన పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వారిలో పదవీగండం పొంచి ఉంది. కానీ టికెట్ రాని వారిని నామినేటెడ్ పదవుల్లో నియమించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. అయితే సర్వే నివేదికల ఆధారంగా నేతల భవితవ్యం తేలనుందని తెలుస్తోంది.
రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువ మంది సీనియర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వారిలో గుబులు పట్టుకుంది. టికెట్ రాకపోతే ఎలా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా వైసీపీ వ్యూహాలలో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సీనియర్ల పని అయిపోయినట్లే అని చెబుతున్నారు. దీంతో ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాలని చూస్తున్నారు. ప్రజలతో దగ్గరయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.