దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు సంబంధించిన ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ను తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. కేవలం 6.66 శాతం వడ్డీ రేటుకే 2 కోట్ల రూపాయల వరకు రుణాన్ని తీసుకునే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతోమందికి ప్రయోజనం చేకూరనుంది.

గతంలో 50 లక్షల రూపాయల వరకు వడ్డీరేటుతో ఈ రుణం తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 2 కోట్ల రూపాయల వరకు ఈ వడ్డీరేటుతో రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే ఈ వడ్డీరేటుకు రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. నవంబర్ 30వ తేదీలోపు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలుస్తోంది.
ఇదే సమయంలో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్ తీసుకునే వాళ్లకు మరికొన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది. హోమ్ లోన్ తీసుకునే వాళ్లు 6 ఈఎంఐల మాఫీ బెనిఫిట్ ను పొందే అవకాశంతో పాటు 10,000 రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. లోన్ కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, మరికొన్ని బ్యాంకులు హోమ్ లోన్ ఆఫర్ ను అందిస్తున్నాయి.
ఈ ఆఫర్ల వల్ల రుణాలు తీసుకునే వాళ్లకు భారీగా మేలు జరగనుందని సమాచారం. రుణం కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఆన్ లైన్ ద్వారానే సులువుగా లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.