https://oktelugu.com/

Gamanam: ఆయనతో కలిసి పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు- గమనం హీరో

Gamanam: ప్రస్తుతం ఉన్న జెనరేషన్​లో కథలో పట్టుంటే చాలు.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క నటీనటులు సినిమాలో కీలక పాత్రలకు ఓకే చెప్పేస్తున్నారు. అలా ప్రస్తుతం ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైందే గమనం సినిమా. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా గమనం. ఈ సినిమాతోనే సంజనా రావు నూతన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. క్రియా ఫిల్మ్​ కార్ప్​, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 10:51 AM IST
    Follow us on

    Gamanam: ప్రస్తుతం ఉన్న జెనరేషన్​లో కథలో పట్టుంటే చాలు.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క నటీనటులు సినిమాలో కీలక పాత్రలకు ఓకే చెప్పేస్తున్నారు. అలా ప్రస్తుతం ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైందే గమనం సినిమా. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా గమనం. ఈ సినిమాతోనే సంజనా రావు నూతన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. క్రియా ఫిల్మ్​ కార్ప్​, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోగా శివ కందుకూరి నటించారు. కాగా,ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా హీరో శివ కందుకూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

    Gamanam

    గమనం సినిమా నా కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.  కథ విన్నవెంటనే నచ్చి ఓకే అన్నా. ఈ సినిమా డైరెక్టర్​కు నాకు మధ్య ఓ కామన్ ఫ్రెండ్​ ఉన్నారు.. వారివల్లే నాకు ఈ ప్రాజెక్ట్ దక్కింది. స్టోరీ విన్నప్పుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారని, బాబుగారు కెమెరామెన్​ అని అసలు తెలేదు. మను చరిత్ర షూటింగ్​లో ఉన్నప్పుడు ఈ కథ విన్నా.ఇండియాలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. కానీ యూఎస్‌కి వెళ్లి చదువుకున్నప్పుడు ప్రాక్టీస్ పోయింది. మళ్లీ ఈ సినిమా కోసం క్రికెట్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా కనిపించాలని అనుకున్నాను. అని చెప్పుకొచ్చారు.

    Also Read: శ్యామ్ సింగరాయ్ నుంచి “సిరివెన్నెల” చివరి పాట రిలీజ్…

    దీంతో పాటు.. సినిమాలోని నటుల గురించి స్పందిస్తూ.. చారు హాసన్ వంటి సీనియర్స్​తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్కరోజు కూడా ఆయన షూటింగ్​కు ఆలస్యంగా రావడం చూడలేదని అన్నారు. ఇళయరాజా గారితో పనిచేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మ్యూజిక్​తో ఈ సినిమా మరో స్థాయికి వెళ్తుందని కొనియాడారు.

    Also Read: భీమ్లా నాయక్ విడుదల తేదీలో మార్పు లేదంటున్న నిర్మాత నాగవంశీ…