అప్పులతోనే జగన్ ప్రభుత్వం మనుగడ

అప్పు లేనిదే కాలు కదపలేని దుస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చిక్కుకొంది. ఆర్ధికంగా దారుణమైన పరిస్థితులు నెలకొనడంతో అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకు పోతున్నది. ఆదాయ వనరులు మెరుగు పడక పోవడం, వృద్ధి అంశాలు పడక వేయడం, ఆర్ధిక కార్యకలాపాలు పూనుకొనక పోవడంతో అప్పులు చేస్తే గానే జీత, భత్యాలు కూడా చెల్లించలేని పరిష్టితులు ఏర్పడుతున్నది. ఈ దుస్థితికి కరోనా జత కావడంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయి. […]

Written By: Neelambaram, Updated On : April 9, 2020 2:34 pm
Follow us on


అప్పు లేనిదే కాలు కదపలేని దుస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చిక్కుకొంది. ఆర్ధికంగా దారుణమైన పరిస్థితులు నెలకొనడంతో అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకు పోతున్నది. ఆదాయ వనరులు మెరుగు పడక పోవడం, వృద్ధి అంశాలు పడక వేయడం, ఆర్ధిక కార్యకలాపాలు పూనుకొనక పోవడంతో అప్పులు చేస్తే గానే జీత, భత్యాలు కూడా చెల్లించలేని పరిష్టితులు ఏర్పడుతున్నది.

ఈ దుస్థితికి కరోనా జత కావడంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే లాక్ డౌన్ ను తొలగించాలని దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా జగన్ మాత్రం నోరు విప్పడం లేదు. అదే జరిగితే ఆర్ధికంగా మరింతగా దుర్భర పరిస్థితులు ఎదురు కాగలవని ఆందోళన చెందుతున్నారు.

గత ఆర్థిక సంవత్సరం చివరి మూడ నెలల్లో (జనవరి, ఫిబ్రవరి, మార్చి-2020) రూ 23 వేల కోట్ల వరకు లోటు నెలకొంది. ప్రస్తుత నెలలో కూడా ఈ పరిస్థితి మరింత తీవ్రం కొనసాగవచ్చని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ శాఖ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం జనవరి నుండి మార్చి వరకు రూ 27,641 కోట్ల ఆదాయం రాగా, రూ 50,515 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఇది సాధారణ లోటు కాదని, ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా దిగజారుతోందనడానికి సంకేతమని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవరి వరకు రూ 34,600 కోట్ల ఆదాయ లోటు ఉండగా, మార్చి 31 నాటికి రూ 48 వేల కోట్లు దాటిపోయింది. దీని ప్రభావం నూతనంగా ప్రారంభమైన 2020-21 ఆర్ధిక సంవత్సరంపై పడుతుందని అంటున్నారు.

ప్రధానంగా కరోనా కారణంగా ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలల్లో ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే ఖర్చులు మాత్రం గత నెల కన్నా ఎక్కువగా ఉంటాయని అంచనా. ఖజానా తీవ్ర సంక్షోభంలో పడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితులు నెలకొనడంతో కేంద్రం నుండి విడుదలయ్యే నిధులు కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గత మూడు నెలల్లో వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే కేంద్రం నుంచి వచ్చిన పన్నుల్లో వాటా, స్థానిక సంస్థల నిధుల వల్ల రూ 13,500 కోట్ల వరకు ఆదాయం ఒక్క మార్చి నెల్లోనే కనిపించింది.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన ఆదాయం కన్నా ఇది దాదాపుగా రెట్టింపు. ఖర్చుల విషయానికి వస్తే జనవరిలో చేసిన రూ 16,597 కోట్ల కన్నా ఫిబ్రవరిలో దాదాపు మూడు వేల కోట్లు తక్కువగా ఖర్చు చేసినప్పటికీ, మార్చిలో రూ 20,641 కోట్లు ఖర్చు పెట్టారు.