24 గంటల్లో 540 మందికి కరోనా…!

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 540 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,734కి చేరిందని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 166 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 5,095 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 473 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,135 మందికి […]

Written By: Neelambaram, Updated On : April 9, 2020 1:51 pm
Follow us on


దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 540 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,734కి చేరిందని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 166 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 5,095 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 473 మంది కోలుకున్నారు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,135 మందికి కరోనా సోకింది. తమిళనాడులో 738, ఢిల్లీలో 669, తెలంగాణలో453, రాజస్థాన్‌లో 381, ఉత్తర్‌ప్రదేశ్‌లో 361 మందికి కరోనా సోకింది. 24 గంటల్లో దేశంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌లో కరోనాతో ఈ రోజు మొదటి మరణం సంభవించింది.

గత 12 గంటల్లో ఒక్క కరోనా కేసు లేదన్న ఏపీ ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకూ జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎందుకు సంబంధించిన బులిటెన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసులు నెగటివ్ గా నిర్దారించబడ్డాయని బులిటెన్ వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో 348 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 9 మంది చికిత్స అనంతరం కరోనా నెగటివ్ నిర్దారణ అయి, డిశ్చార్జ్ అయ్యారు.