Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి.. స్వయాన ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్. హత్యకు గురై మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకూ కేసు కొలిక్కి రాలేదు. కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ విచారిస్తున్నా కేసులో ఆశించినంత స్థాయిలో పురోగతి లేదు. పైగా సీబీఐ సైతం చేతులెత్తేసింది. వివేకా హత్య రాజకీయంగా జగన్ కు ఎంతో లబ్ధి చేకూర్చింది. సానుభూతి పనిచేసి ఓట్లుగా మలుచుకున్నారు. ఒక అడుగు ముందుకేసి నాటి చంద్రబాబు సర్కారే ఈ హత్యకు పురిగొలిపిందని కూడా ఆరోపణలు చేశారు. ఇవి ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. జగన్ కు గుంపగుత్తిగా ఓట్లు పడ్డాయి.
అంతవరకూ బాగానే ఉంది కానీ మూడేళ్లు దాటుతున్నా నిందితులను పట్టుకోలేకపోయారు. కేవలం అనుమానితులను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోరిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. సీట్ ను ఏర్పాటుచేశారు. వివేకా కుమార్తె సునీత విన్నపం మేరకు మాత్రమే సీబీఐకి కేసు అప్పగించారు. అయితే ప్రథమాంకంలో దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ తరువాత మాత్రం స్లో అయ్యింది.
Also Read: Pawan Kalyan: స్ట్రేటజీ మార్చిన పవన్.. అన్ని అంశాలపై ఫుల్ క్లారిటీ
రకరకాల ఒత్తిళ్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపై కేసులే కాదు.. బాంబులేస్తామన్న బెదిరింపులు కూడా వచ్చాయి. మొన్నటికి మొన్న సీబీఐ కారు డ్రైవర్ కు నడిరోడ్డుపై ముసుగు వ్యక్తి బెదిరించారు. విచారణ నుంచి తప్పుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. హతమారుస్తామని కూడా బెదిరించారు. మీ కదలికలు మొత్తం తెలుసునంటూ కారు నంబర్లు, ఎవరెవరిని ఎప్పుడు కలిసింది కూడా పుసగుచ్చినట్టు చెప్పారు. అయితే దీనిపై బాధిత సీబీఐ డ్రైవరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
స్పీడుగా చేయలేం…
అయితే ఇటీవల పరిణామాలు వివేకా హత్య కేసును నీరుగారుస్తున్నాయి. వివేకా హత్య కేసులో సీబీఐ పూర్తిగా చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది. విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని సీబీఐ నేరుగా న్యాయస్థానానికే చెప్పేసింది. ఎందుకంటే.. తమకు ఎవరూ సహకరించడం లేదని.. అధికారులు కూడా తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపింది. ఈ కారణంగా విచారణ ముందుకు సాగడం లేదన్నారు. నిందితులు తమకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ పెట్టుకున్నారు.నిందితులు జైలు నుంచే సాక్షుల్ని బెదిరిస్తున్నారని.. వారికి బెయిల్ ఇవ్వొద్దని .. సీబీఐ వాదించింది. ఈ సందర్భంగానే విచారణ ఎంత కాలం ఉంటుందో చెప్పాలని సీబీఐని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే సహకరించే ప్రభుత్వం, అధికారులు, పోలీస్ వ్యవస్థ వచ్చే వరకూ విచారణ జరపలేమని అర్ధం వచ్చేలా సీబీఐ తన వ్యాఖ్యల ద్వారా చెప్పేసింది. సీబీఐ నిస్సహాయత.. ఎవరూ సహకరించని వైనంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో కానీ.., సీబీఐకే… వివేకా హత్య కేసులో సవాళ్లు ఎదురవుతున్నాయని మాత్రం స్పష్టమయింది.
అధికార పార్టీలో విస్మయం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనకు సంబంధించి వైసీపీ శ్రేణుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో జగన్ వ్యవహార శైలిని కూడా చాలామంది అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. అయితే కేసు విచారణ విషయంలో జగన్ బాగా డ్యామేజ్ అయ్యారని చెబుతున్నారు. వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబు సర్కారు చేయించిందని.. నారాసుర రక్తచరిత్ర అంటూ తన సొంత పత్రికల్లో పతాక శీర్షిక కథనాలు వండి వార్చారు. తొలుత సీబీఐ కి కేసు అప్పగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తో పాటు అప్పటి టీడీపీ కీలక నాయకుల పాత్రపై రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అయితే హత్య మార్చిలో జరగగా.. జగన్ జూన్ లో అధికారంలోకి వచ్చారు. దీంతో కేసు కొలక్కి వచ్చి నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని వైసీపీ శ్రేణులు భావించాయి. కానీ అక్కడ నుంచి దర్యాప్తు సంస్థ సీబీఐ కు ఏపీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. మరోవైపు అనుమానితుల అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా జగన్ కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పుడే వైసీపీ శ్రేణుల్లో ఒకలాంటి అనుమానం ప్రారంభమైంది. అసలు వైసీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కేసు కొలిక్కి వచ్చే అవకాశమే లేదన్నవ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read:CM Jagan- Davos Meeting: సీఎం జగన్ లండన్ లో ఎందుకు దిగినట్టు?