Mahesh Babu: తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంత సాధారణంగా ఉంటారో అందరికి తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడి ప్రకారం ఆయన సింపుల్ సిటీకే ప్రాధాన్యం ఇస్తారు. అందరిలా హడావిడి చేయరు. ఎన్నో మంచి పనులు చేస్తున్నా అవి ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంతో మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తూ వారి మదిలో దేవుడిలా వెలిగినా ఎప్పుడు కూడా తన కార్యక్రమాలు ప్రచారం చేసుకోరు. ఈ నేపథ్యంలోనే అభిమానులు కూడా అందుకే ఆయనను ఇష్టపడుతుంటారు. ఆయనలోని గుణాలను చూసి ఫిదా అయిపోతుంటారు.
ఘట్టమనేని కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా తనదైన శైలిలో నటనలో వైవిధ్యం చూపిస్తూ బ్రహ్మాండమైన హిట్లు ఇస్తుంటారు. బాక్సాఫీస్ కలెక్షన్లు షేక్ చేయడం ఆయనకు అలవాటే. ప్రతి సినిమాకు సంబంధం లేకుండా కొత్తదనమే ఊపిరిగా తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన చిత్రాలు విజయవంతమవుతుంటాయి. సినిమాలతోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకు మనసుందని నిరూపించుకుంటున్నారు. ఎందరో చిన్నారుల హృదయాల్లో వెలుగులు నింపుతున్నారు.
Also Read: Chiranjeevi: చిరంజీవికి ఆ ఇద్దరంటేనే ఇష్టమట?
ఏది చేసినా బయటకు కనిపించకుండా చేయడమే ఆయనకు అలవాటు. అందుకే ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం వద్దంటారు. దీంతోనే ఆయన సింపుల్ సిటీ అందరికి నచ్చుతుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పీకాక్ మ్యాగజైన్ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ చాలెంజ్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.
ఇందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చేస్తూ తనకు దర్శకుడిగా అవకాశం వస్తే తాను హీరోగా నటించిన ఒక్కడు సినిమాను మళ్లీ తీస్తానని చెప్పుకొచ్చారు. మీకు ఎమోషనల్ గా బాగా దగ్గరయిన చిత్రం ఏంటని అడిగితే హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ సినిమా చూసి ఏడ్చినట్లు చెప్పారు. మహేశ్ బాబు తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. తన సినిమాల్లో వయిలెన్స్ కన్నా సైలెన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. అందుకే ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.
Also Read: Anupama parameswaran: అవకాశాల కోసం ‘అనుపమ’ అందాల విందు.. హాట్ పిక్స్ వైరల్
Recommended Videos