spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan- BJP: బీజేపీతో పొత్తు కోసం అంతపనికి దిగజారుతున్న జగన్.. సంచలన నిర్ణయం

Jagan- BJP: బీజేపీతో పొత్తు కోసం అంతపనికి దిగజారుతున్న జగన్.. సంచలన నిర్ణయం

Jagan- BJP: టీడీపీ పొత్తుల ప్రయత్నాన్నివిచ్ఛిన్నం చేయాలని వైసీపీ భావిస్తోందా? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ గూటికి చేరకుండా ఉండడానికి ప్రయత్నాలు ప్రారంభించిందా? అవసరమైతే తానే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడుతోందా? ఇందుకుగాను కీలక ఎంపీ స్థానాలను వదులుకోవడానికి ముందుకొచ్చిందా? ఎన్డీఏ జాబితాలో పార్టీలు తగ్గుతున్న వేళ జగన్ పావులు కదపడం ప్రారంభించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. జగన్ ఢిల్లీ టూర్ లో పొలిటికల్ అజెండా ప్రధానమన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ టీడీపీ వైపు వెళ్లకుండా నిలువరించడానికి కొన్ని నిర్థిష్టమైన ప్రణాళికలు కేంద్ర పెద్దల ఎదుట పెట్టే చాన్స్ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అందులో కీలకమైనది బీజేపీతో పొత్తు అని తెలుస్తోంది.

Jagan- BJP
Jagan- modi

ప్రస్తుతం ఏపీలో పొత్తుల అంశం కీలకంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అటు చంద్రబాబు తెలంగాణలో రీఎంట్రీ ఉద్దేశ్యం కూడా ఏపీలో పొత్తులకు మార్గం సుగమం చేసుకోవడానికేనన్న ప్రచారం ఉంది. తన బలాన్ని నిరూపించుకొని తెలంగాణలో బీజేపీకి సాయం చేసి ఏపీలో కాషాయ దళం సాయం తీసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు వైసీపీ నేతలు కూడా అదే అంచనా వేస్తున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో బీజేపీకి ఓటు షేర్ అంతంతమాత్రమే. కానీ ఏపీలో ఎన్నికలు అంత ఈజీగా జరుగుతాయని అనుకోవట్లేదు. అందుకే చంద్రబాబు బీజేపీ సాయం తీసుకోవాలని భావిస్తున్నారు.

అటు జనసేన సైతం పొత్తుల పై అధికారికంగా ప్రకటించనప్పటికీ.. వైసీపీ విముక్త ఏపీ అంటూ పవన్ పదే పదే చెప్పడం ద్వారా తాను పొత్తులకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు బీజేపీ సైతం ఎన్నికల నాటికి ఈ కూటమికి చేరవచ్చని ఒక అంచనా ఉంది. అటు చంద్రబాబు సైతం అదే పనిలో ఉండడంతో అధికార వైసీపీ డిఫెన్స్ లో పడింది. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది. దానికి బీజేపీ సాయం తోడైతే మాత్రం డేంజర్ తప్పదని జగన్ భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ వైపు టర్న్ కాకుండా చూసుకోవాలని జగన్ గట్టి ప్రయత్నాలే మొదలు పెట్టారు.

Jagan- BJP
Jagan- modi

ప్రస్తుతం ఎన్డీఏ లో పార్టీల సంఖ్య కూడా తగ్గింది. నమ్మదగిన మిత్రులు ఒక్కొక్కరూ దూరమవుతూ వస్తున్నారు. గత ఎన్నికల తరువాత శివసేన, జేడీయూ వంటి పార్టీలు దూరమయ్యాయి. అందుకే కొత్తగా ఎన్డీఏలో చేరే పార్టీల కోసం వేచిచూస్తున్నాయి. ఆహ్వానిస్తున్నాయి కూడా. సరిగ్గా ఇదే సమయంలో జగన్ పావులు కదపడం ప్రారంభించారు. తనకు ఇష్టం లేకున్నా టీడీపీ వైపు బీజేపీ వెళ్లకుండా నిలువరించడానికి మరో మార్గం లేకపోవడంతో జగన్ కొత్త ప్రతిపాదనలతో ముందుకెళుతున్నారు. అసెంబ్లీ సీట్లు ఇవ్వకుండా కొన్ని కీలక ఎంపీ స్థానాలను వదులుకునే ప్రతిపాదనలను కేంద్ర పెద్దల ముందు ఉంచనున్నట్టు సమాచారం. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే మాత్రం వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు ఖాయమైనట్టే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper