మరో సరికొత్త సంక్షేమ పథకం అమలు చేయబోతున్న జగన్?

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన పథకాలతో పాటు హామీ ఇవ్వని పథకాలను సైతం అమలు చేస్తూ జగన్ సర్కార్ ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటోంది. తాజాగా జగన్ సర్కార్ మరో సంచలన పథకం అమలుకు సిద్ధమవుతోంది. వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల అమలుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. Also Read : జగన్ పై హిందువుల […]

Written By: Navya, Updated On : September 8, 2020 9:39 am
Follow us on

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన పథకాలతో పాటు హామీ ఇవ్వని పథకాలను సైతం అమలు చేస్తూ జగన్ సర్కార్ ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటోంది. తాజాగా జగన్ సర్కార్ మరో సంచలన పథకం అమలుకు సిద్ధమవుతోంది. వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల అమలుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది.

Also Read : జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?

చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. నేడు ఈ పథకాలను సీఎం జగన్ అందించారు. క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. అధికారుల నుంచి ఈ రెండు పథకాల ద్వారా ఇస్తున్న మెనూతో పాటు ఇతర వివరాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాల ద్వారా ఇచ్చే పదార్థాలను రుచి చూశారు.

బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే జగన్ సర్కార్ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్‌ బాల సంజీవని, వైఎస్సార్ అమృతహస్తం లాంటి పథకాలను అమలు చేస్తోంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం రాష్ట్రంలోని 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు కానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం మూడున్నర వారాల పాటు పాలు, కూరగాయలు, అన్నం, పప్పు అందజేస్తోంది. ప్రభుత్వం ఈ పథకం కోసం 87 కోట్ల రూపాయల చొప్పున ఒక్కొక్క లబ్ధిదారుడికి 1,100 రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమవుతోంది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో 5.80 లక్షలమంది గర్భిణీలు జగన్ సర్కార్ పాలు, అన్నం, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది.

Also Read : జగన్ తీసుకున్న ఆ నిర్ణయం మళ్లీ ఫెయిల్ కానుందా…?