https://oktelugu.com/

జగన్ తీసుకున్న ఆ నిర్ణయం మళ్లీ ఫెయిల్ కానుందా…?

2019 ఎన్నికల ఫలితాల్లో 151 సీట్లతో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో సమయం అనుకూలించడం లేదు. జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ నిర్ణయం కానీ జగన్ మూడు రాజధానుల నిర్ణయం కానీ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నా వివిధ కారణాల వల్ల ప్రతి సందర్భంలోనూ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. Also Read : మరో సరికొత్త సంక్షేమ పథకం అమలు చేయబోతున్న జగన్? కోర్టుల్లో జగన్ సర్కార్ […]

Written By: , Updated On : September 7, 2020 / 08:07 PM IST
Follow us on

Will the decision taken by Jagan fail again

2019 ఎన్నికల ఫలితాల్లో 151 సీట్లతో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో సమయం అనుకూలించడం లేదు. జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ నిర్ణయం కానీ జగన్ మూడు రాజధానుల నిర్ణయం కానీ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నా వివిధ కారణాల వల్ల ప్రతి సందర్భంలోనూ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.

Also Read : మరో సరికొత్త సంక్షేమ పథకం అమలు చేయబోతున్న జగన్?

కోర్టుల్లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై పిటిషన్లు దాఖలవుతూ ఉండటం వల్ల జగన్ సర్కార్ తీసుకున్న్ నిర్ణయాలకు బ్రేకులు పడుతున్నాయి. గతేడాది టీడీపీ సభ్యుల వల్ల మూడు రాజధానుల బిల్లును శాసన మండలి తిరస్కరించింది. అయితే గవర్నర్ ఆమోదంతో మూడు రాజధానుల నిర్ణయం అమలుకు ఎటువంటి ఆటంకాలు ఉండవని భావించిన జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పెద్దఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి.

వరుస స్టేల వల్ల జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని దసరాకు కూడా అమలు చేయడం కష్టమేనని తెలుస్తోంది. జగన్ విజయదశమి సందర్భంగా మూడు రాజధానులను అమలు చేద్దామని భావిస్తున్నా మరోసారి జగన్ నిర్ణయం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం రాష్ట్ర రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వందే తుది నిర్ణయం అని చెప్పినా కోర్టు మాత్రం మూడు రాజధానుల నిర్ణయం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

సుప్రీం కోర్టు సైతం హైకోర్టు స్టేను తొలగించలేమని చెప్పడంతో జగన్ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది. విశాఖకు చెందిన స్వరూపానందేంద్ర స్వామీజీ సూచనల మేరకు అక్టోబర్ 25వ తేదీన విశాఖకు రాజధానిని తరలించడానికి జగన్ సిద్ధమవుతున్నా న్యాయపరమైన చిక్కులు ఉండడంతో ఈ సంవత్సరం మూడు రాజధానుల నిర్ణయం అమలు కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?