ప్రస్తుతం ఏపీలో ఏ పని జరగాలన్నా అప్పు చేయడమే శరణ్యం లాగా అయిపోయింది పరిస్థితి. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ జగన్ అభివృద్ధిని గాలికి వదిలేశాడు అన్న మాటలకు ఊతం ఇచ్చేలా ప్రతీ నెలా ఎక్కడో ఒకచోట అప్పు చేస్తూ జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుతున్నారు. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ప్రస్తుతం మరుగున పడిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లేవనెత్తేందుకు జగన్ ఖచ్చితంగా కొత్త ఆదాయ మార్గాలను వెతకాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో అతను ఎంతో తెలివిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. వాటి గురించి మాట్లాడుకుంటే…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎవరూ పట్టించుకోని అంశాలలో పన్నులు, ధరలు పెంచి రాష్ట్రానికి కనీస ఆదాయాన్ని సమకూర్చాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. మద్యం ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరలు భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు వంటివి ఎంతో సైలెంట్ గా జగన్ కొత్త ప్రక్రియలో మమేకమైపోయాయి. దీనిని కూడా ప్రజానీకం ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
వీటిలో ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం వల్ల అసలు తెలియకుండానే భారీ లాభం రాష్ట్ర ఖజానాకు చేరేస్తుంది. పైగా ఈ మూడు రాజధానుల దెబ్బతో ఒక్కసారిగా అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇకపోతే ఈ సంవత్సరంలోనే రెండుసార్లు కరెంట్ చార్జీలు పెంచేశారు. సామాన్య ప్రజలపై అధిక భారం పడేలా ఆర్టీసీ చార్జీలు కూడా పెరిగిపోయాయి. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత రవాణా శాఖలో కూడా జగన్ మెల్లగా పన్నులు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే మనిషి కి ప్రతిరోజూ ఉండే అవసరాలలో ఇవి ఏవీ ఉండవు. అందుకే ఎప్పుడో ఒకసారి చెల్లించే రూపాయి, రెండు రూపాయలు అటూ ఇటూ అయినా పట్టించుకోకుండా వెచ్చిస్తారు.
ఇక రవాణాశాఖలో పన్నుల విషయానికి వస్తే…. దాదాపు జగన్ టార్గెట్ రూ. 400 కోట్లు అని సమాచారం. అందుకు ఫోర్ వీలర్ లైఫ్ టాక్స్ పెంపుకు రంగం సిద్ధం చేశారు. దీని వల్ల రాష్ట్రానికి రూ. 140 కోట్ల ఆదాయం వస్తుంది. ఇక టూ వీలర్ పై 2010 తర్వాత పన్నుని పెంచింది లేదు. ప్రస్తుతం ఇది 9.12 శాతంగా ఉంది. దీని వల్ల దాదాలు రూ. 180 కోట్ల రూపాయలు లాభం రానుంది. వ్యూహాత్మకంగా ఇలా జగన్ ఆదాయం పెంచేస్తున్న పద్ధతి చూసి విశ్లేషకులు నోర్లెళ్లబెడుతున్నారు.