https://oktelugu.com/

కరోనాకి దూరంగా ‘పుష్ప’ ప్రత్యేక జాగ్రత్తలు !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఈ నెలలో స్టార్ట్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు. నిజానికి ఆగ‌స్ట్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయాలని ప్లాన్ చేసి.. ఆ తరువాత ఆగిపోయారు. ఇక ఎట్టిపరిస్థితుల్లో ఈ నెల రెండో వారం నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని.. సెట్ కూడా వేశారు. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో […]

Written By:
  • admin
  • , Updated On : September 6, 2020 / 10:45 AM IST
    Follow us on


    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఈ నెలలో స్టార్ట్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు. నిజానికి ఆగ‌స్ట్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయాలని ప్లాన్ చేసి.. ఆ తరువాత ఆగిపోయారు. ఇక ఎట్టిపరిస్థితుల్లో ఈ నెల రెండో వారం నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని.. సెట్ కూడా వేశారు. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో షూట్ స్టార్ట్ చేస్తున్నాం అని అంతా రెడీ చేసుకున్నాక.. టీమ్ లోని ఓ సభ్యుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఇక షూటింగ్ ను వచ్చే నెలకు పోస్ట్ ఫోన్ చెయ్యకతప్పలేదు. మరి వచ్చే నెల లోపు కరోనా తగ్గుతుందని నమ్మకం ఏముంది.. అందుకే ఈ నెలలోనే స‌భ్యులంద‌రికీ కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ ఈ నెలాఖరులోగా జన సాంద్రతకు దూరమైన ప్రాంతానికి తరలించాలని టీమ్ భావిస్తోంది.

    Also Read: పూరి కథలు.. మహేష్ తోనా ? రానాతోనా ?

    అలాగే ఈ సినిమా షూట్ జరుగుతున్న అంత కాలం ముఖ్యంగా పుష్ప చిత్రబృందం వారు ఇత‌రుల‌ను కలిసే అవకాశం లేకుండా కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని.. ఒకవేళ ఎవరికైనా అర్జెంట్ గా బయట వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే.. ఇక వారిని మళ్లీ వెంటనే టీమ్ లోకి జాయిన్ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేకర్స్ పతిష్ఠంగా నిర్ణయించారు. ఇక ఇత‌రులు పుష్ప టీం ఉన్న ప్ర‌దేశానికి వచ్చే అవకాశం లేకుండా కూడా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారట. వచ్చే నెల 15 నుండి మొదలవ్వనున్న ఫస్ట్ షెడ్యూల్ లో ముందుగా బన్నీ – రష్మిక పై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సాంగ్ తరువాత సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ షూట్ ను కూడా పూర్తి చేస్తారట. ఈ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకుంటున్నారు.

    Also Read: బ్రేకప్ లు, డైవోర్స్ కథలో రామ్ ‌!

    ఇక ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. కానీ విజయ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్రలో మరో తమిళ్ హీరో ఆర్యను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఆర్య గతంలో బన్నీ వరుడు సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే ఇక రష్మిక కెరీర్ కూడా పీక్ కి వెళ్ళిపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.