https://oktelugu.com/

జగన్‌ నిర్ణయం.. ఏపీకి నష్టం.. తెలంగాణకు ఆదాయం..!

తెలుగురాష్ట్రాల సరిహద్దులో పెట్రోల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఇటీవల పెట్రో ధరలపై తీసుకున్న నిర్ణయం తెలంగాణ పెట్రోల్‌ బంకు యజామానులకు వరంగా మారింది. ఆంధ్రలో కంటే తెలంగాణలో పెట్రోల్‌ ధరలు తక్కువగా ఉన్నాయంటూ ఫ్లెక్సీలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ పెట్రోల్‌ బంకులకు గిరాకీ జోరందుకుంది. Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 01:04 PM IST
    Follow us on

    తెలుగురాష్ట్రాల సరిహద్దులో పెట్రోల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఇటీవల పెట్రో ధరలపై తీసుకున్న నిర్ణయం తెలంగాణ పెట్రోల్‌ బంకు యజామానులకు వరంగా మారింది. ఆంధ్రలో కంటే తెలంగాణలో పెట్రోల్‌ ధరలు తక్కువగా ఉన్నాయంటూ ఫ్లెక్సీలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ పెట్రోల్‌ బంకులకు గిరాకీ జోరందుకుంది.

    Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్

    ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు బంకుల యజమానులు రాష్ట్ర సరిహద్దుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ కంటే ఆంధ్రలో పెట్రోల్‌ రూ.3, డీజిల్‌ ధర రూ.2.70 ఎక్కువగా ఉందంటూ జనాల్ని ఆకర్షిస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనదారులు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న బంకుల్లో పెట్రోల్‌ పోయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

    అయితే ఈ వ్యాపారం కేవలం తెలంగాణ, ఆంధ్రల మధ్యే కాకుండా కర్ణాటక బార్డర్లో కూడా సాగుతున్నట్లు సమాచారం. దీంతో ఆంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుందని కొందరు వ్యాపారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాకు ఎక్కడంతో ధరల విషయం తెలుసుకున్న వాహనాలు ఎక్కడ ధరలు తక్కువగా ఉంటే అక్కడ పెట్రోల్‌ కొంటున్నారు.

    Also Read: జగన్‌ నిర్ణయం.. ఏపీకి నష్టం.. తెలంగాణకు ఆదాయం..!

    గతంలో మద్యం ధరల్లో కూడా తెలంగాణ, ఆంధ్రల మధ్య తేడాలు ఉండడంతో జోరుగా అక్రమ వ్యాపారం సాగింది. ఇప్పుడు పెట్రోల్‌ ధరల్లో కూడా తేడాలు ఉండడంతో బంక్‌ వ్యాపారులు క్యాష్‌ జోరుగా వ్యాపారం సాగుతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ఈ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆంధ్రలో ఉన్న వాహనదారులు అక్కడికి పరుగులు తీస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి..