మార్కెట్లో ఏ చానల్‌కు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో.. ఏ చానల్‌ను ఎక్కువగా వాచ్ చేస్తున్నారో.. టీఆర్పీ రేటింగ్‌ల ద్వారా తెలుసుకుంటుంటారు. ఒక్కో భాషలో ఒక్కో ఛానల్ టాప్ ప్లేస్‌ను కొనసాగిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే.. ఇప్పటివరకు టీవీ9 టాప్ ఛానెల్ జాబితాలో ఉండగా.. ఇటీవల ఎన్టీవీ ఆ ప్లేస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ టీఆర్పీల్లోనూ పలు భాషల్లోని ఛానల్స్ అవకతకవలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది.
Also Read: అనిల్ అంబానీ జైలుకు పోకుండా ముఖేష్ అంబానీ సాయం చేయలేదా?
అయితే.. ముంబైలోని టెలివిజన్ రేటింగ్ పాయింట్ల స్కాంను పోలీసులు బట్టబయలు చేశారు. టీఆర్‌పీలను పెంచుకునేందుకు ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ, మరో రెండు మరాఠీ చానెళ్లు అడ్డదార్లు తొక్కాయని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరాఠీ ఛానెళ్ల సీనియర్ అధికారులను అరెస్ట్ చేశారు. సుప్రసిద్ధ జర్నలిస్టు, న్యూస్ ప్రజెంటర్ అయిన అర్నబ్ గోస్వామి చీఫ్ ఎడిటర్‌గా ఉన్న రిపబ్లిక్ టీవీకి చెందిన వారిని అయితే ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
టీవీ రేటింగ్‌లను నిర్ణయించే బార్క్ తరఫున మీటర్ల మానిటరింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న హంస అనే ఏజెన్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారని, హంస ఏజెన్సీలో పనిచేసి మానేసిన సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నామని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ గురువారం మీడియాకు చెప్పారు. ఈ చానెళ్లు ముంబై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల ఇళ్లలో బార్క్ నెలకొల్పిన బేరోమీటర్లను టాంపరింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా రుజువైందని సీపీ తెలిపారు. ఆ నివాసాల్లో ఉండేవారికి డబ్బులిచ్చి వారు తమ ఛానెల్‌నే నిరంతరం ఆన్‌చేసి ఉంచేలా రిపబ్లిక్ టీవీ, ఇతర మరాఠీ చానెళ్లు ఒప్పందానికి వచ్చాయని పేర్కొన్నారు. అయితే అర్నబ్ గోస్వామి మాత్రం తమ ఛానెల్‌పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రిపబ్లిక్ టీవీని మహారాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.
Also Read: బిజెపి కి తూర్పు గాలి వీస్తుంది
ప్రేక్షకుల అభిరుచులను, వివిధ కార్యక్రమాలపై వారి ఆదరణను అంచనా వేసి, వాటి ఆధారంగా ఛానెళ్ల రేటింగ్‌ను ఈ టీఆర్పీ ద్వారా నిర్ణయిస్తుంటారు. ఏ కార్యక్రమాన్ని ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించారు.. ఏ బ్రేక్ న్యూస్‌లకు ఎక్కువ ఆదరణ లభించింది..? ఏ ఛానెల్‌ను ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు..? ప్రాతిపదికన రేటింగ్ ఇస్తారు.ఇందుకు చాలా మంది ఇళ్లలో మీటర్లను పెడతారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) మార్గదర్శకాలను అనుసరించి బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఈ రేటింగ్‌లను ఇస్తుంది. అయితే.. ఈ పోటాపోటీ ప్రపంచంలో తమ ఛానెల్ టాప్‌లో ఉందని చెప్పుకునేందుకు పలు ఛానెళ్లు ఈ అక్రమాలకు తెరలేపాయి.