తెలంగాణ అసెంబ్లీ మరో మారు సమావేశం కానుంది. సెప్టెంబరు 7 నుంచి నిర్వహించిన సమావేశాలను 8 పనిదినాల తర్వాత.. కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉన్నందున.. మరో రెండు రోజులు అంటే సోమ, మంగళవారాల్లో సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, ప్రోరోగ్ చేయలేదు కాబట్టి ఎపుడైనా తిరిగి ప్రారంజగన్ నిర్ణయం.. ఏపీకి నష్టం.. తెలంగాణకు ఆదాయం..!భించుకోవచ్చు. దీనిపై ప్రభుత్వం శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: జగన్ నిర్ణయం.. ఏపీకి నష్టం.. తెలంగాణకు ఆదాయం..!
కరోనా నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధంతరంగా ముగించింది. రెవెన్యూ చట్టానికి ఆమోదంతో ఎల్‌ఆర్‌ఎస్ అంశాన్ని ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారు. అయితే.. మరో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటారా..? మరో నెల లేదా రెండు నెలల్లో గ్రేటర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి.
జీహెచ్‌సీ చట్టానికి సవరణ తెచ్చేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారట. 2016లోని రిజర్వేషన్‌లతోనే ఈ ఎన్నికలు జరిపేలా చట్టం చేయనున్నారు. రిజర్వేషన్‌లు వరుసగా రెండో పర్యాయం వర్తించేలా నిబంధనను పొందుపరిచేందుకు తొలుత ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించినప్పటికీ, మరికొన్ని చట్టాల సవరణలు అవసరమున్న నేపథ్యంలో రెండు రోజులపాటు అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుత జీహెచ్‌ఎంసీ యాక్ట్-1955 ప్రకారం ప్రతి ఎన్నికలకూ రొటేషన్ ప్రాతిపదికన వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఫిబ్రవరి 10, 2021 నాటికి ప్రస్తుత పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో చట్టంలోని వెసులుబాటు ఆధారంగా నవంబరు లేదా డిసెంబరులో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటి జీహెచ్‌ఎంసీ యాక్ట్ ప్రకారం ఎన్నికలకు వెళితే.. బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల ఖరారు తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశముంది. కొవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే ప్రమాదకరమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగేలా, 16 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్టు సమాచారం. 2016లో 16 రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గడువు 22 రోజులకు పెంచారు. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిర్వహించిన తరహాలో 16 రోజుల్లో గ్రేటర్‌లోనూ ఎన్నికలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: వచ్చే ఎన్నికల్లో బీజేపీ కొత్త కూటమి!
అయితే రిజర్వేషన్ల కొనసాగింపునకు జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరిస్తారా? గ్రేటర్‌కు సంబంధించి ఎన్నికల నిర్వహణ అంశానికి సంబంధించి కొత్త చట్టం తీసుకువస్తారా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వీటిపై స్పష్టత కోసమే రాష్ట్ర సర్కార్ మరో రెండు రోజులపాటు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటుచేస్తోంది. ఏకాభిప్రాయంతో చట్టానికి సవరణ తేవడానికి ప్రయత్నిస్తోంది.