https://oktelugu.com/

ఆ ఎమ్మెల్యేకు జగన్ క్లాస్‌..: మళ్లీ రిపీట్‌ కావద్దని ఆర్డర్‌‌

తాడిపత్రిలో రచ్చ చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపారు కేతిరెడ్డి పెద్దిరెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కత్తులు, కటార్లతో వెళ్లి రచ్చ చేయడం.. అది కాస్త సీసీ కెమెరాల్లో రికార్డు కావడం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇరు వర్గాలపై కేసులు నమోదు కావడం సీఎం జగన్‌కు కోపం తెప్పించింది. ఆ వ్యవహారం అలా నడుస్తూండగానే.. జేసీ బ్రదర్స్ దీక్షలు చేశారు. దీంతో తాడిపత్రిలో రోజూ ఉద్రిక్త వాతావరణమే ఉంటోంది. పెద్ద ఎత్తున పోలీసు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 6, 2021 / 12:52 PM IST
    Follow us on


    తాడిపత్రిలో రచ్చ చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపారు కేతిరెడ్డి పెద్దిరెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కత్తులు, కటార్లతో వెళ్లి రచ్చ చేయడం.. అది కాస్త సీసీ కెమెరాల్లో రికార్డు కావడం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇరు వర్గాలపై కేసులు నమోదు కావడం సీఎం జగన్‌కు కోపం తెప్పించింది. ఆ వ్యవహారం అలా నడుస్తూండగానే.. జేసీ బ్రదర్స్ దీక్షలు చేశారు. దీంతో తాడిపత్రిలో రోజూ ఉద్రిక్త వాతావరణమే ఉంటోంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించి శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సి వస్తోంది. ఈ పరిణామాలపై.. ఇంటలిజెన్స్ నుంచి రిపోర్ట్ అందిందేమో కానీ.. ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.

    Also Read: ప్యాకేజీ పవన్‌..: ఆ ముద్ర పోయేదెలా..!

    పెద్దారెడ్డిని హుటాహుటిన పిలిపించుకుని జరిగిన ఘటనపై వివరణ తీసుకున్నారు. స్వయంగా జగన్ పెద్దారెడ్డితో మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి తాను మాట్లాడటానికే వెళ్లినట్లుగా సీఎం జగన్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో కానీ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని చెప్పి పెద్దారెడ్డిని పంపేశారు. అయితే.. అనంతపురం జిల్లాకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణకు పార్టీ పరమైన బాధ్యతలు ఉండటంతో.. ఆయనను కూడా సమావేశానికి పిలిచారు.

    అసలు ఆ జిల్లాలో ఏం జరుగుతోంది..? అనే విషయాలపై జగన్‌ తెలుసుకున్నట్లు సమాచారం. టీడీపీ నేతలతో ఆ మాత్రం దూకుడుగా ఉండకపోతే.. కష్టమన్న అభిప్రాయం అనంతపురం నేతలు వ్యక్తం చేస్తున్నారని వైసీపీ హైకమాండ్‌కు నివేదికలు సైతం అందాయి. అయితే ప్రభుత్వ ఇమేజ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. అలా కత్తులు, కటార్లతో ఇళ్లపైకి వెళ్తే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనుకుంటారని.. ఇప్పటికైనా సున్నితంగా డీల్ చేయాలని చెప్పి పంపించినట్లుగా భావిస్తున్నారు.

    Also Read: ఆ ఇద్దరు మంత్రుల మధ్య పొసగడం లేదట..: ఎందుకంటే..?

    కొద్ది రోజుల క్రితం తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌‌ రెడ్డి ఇంటికి వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అటు సోషల్‌ మీడియాల్లో జేసీ అనుచరుడిగా ఉన్న కిరణ్‌ తనను విమర్శస్తున్నాడని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ప్రభాకర్‌‌రెడ్డి ఇంట్లోనే కిరణ్‌పై పెద్దారెడ్డి చేయి చేసుకున్నారు. దీంతో రగిలిపోయిన జేసీ వర్గీయులు ఎదురుదాడికి దిగారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు రాళ్లదాడికి దిగడంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీనిపైనే పెద్దారెడ్డిని జగన్‌ పిలిచి వివరణ తీసుకున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్