రాజకీయాలు కులాల వారీగా మారిపోయాయి. కుల ప్రాతిపదికగానే ఓట్లు, సీట్లు ప్రభావితం అవుతున్నాయి. ఏ కులం వారి ఓట్లు ఎక్కువగా ఉంటే వారికే టికెట్లు ఇవ్వడం పార్టీలు చేస్తుంటాయి. ఏ కులం వారి ఓట్లు ఎక్కువగా ఉంటే వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రయోజనం పొందుతున్న మాట వాస్తవమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడో కుల ప్రాతిపదికగా మారిపోయాయి. ఆర్థిక అసమానతలను పోగెట్టే క్రమంలో పార్టీలు వారిని టార్గెట్ చేస్తున్నాయి. అట్టడుగున ఉన్న వర్గాలకే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా ఆర్థికవృద్ధి సాదించేందుకు పార్టీలు సాయపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అగ్రవర్ణ పేదల అభివృద్ధి కోసం పథకాలు ప్రవేశపెడుతున్నారు ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. నిబంధనలు సడలించి వారికి చేయూతనిందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వార్షికాదాయం రూ. 8 లక్షలకంటే తక్కువగా ఉన్నవారందరు కూడా పేదలే అని చెబుతోంది. దీంతో రాష్ర్టంలో 95 శాతం మంది పేదలే ఉన్నారు. ఐదు శాతం మంది మాత్రమే ఆర్థికవృద్ధి సాధించినవారని తెలుస్తోంది.
అగ్రవర్ణాలు చంద్రబాబుకు మంచి ఆప్తులుగా ఉన్నారు. వారు ఎప్పుడు బాబు పక్షమే. ప్రస్తుతం జగన్ కూడా వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతులైనట్లు తెలుస్తోంది. టీడీపీపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ మధ్య వైసీపీకి దగ్గరైనట్లు సమాచారం. రెండేళ్లుగా రాష్ర్టంలో అభివృద్ధి పనులు జరగక పోవడంతో వారు టీడీపీకి మద్దతు పలుకుతున్నట్లు చెబుతున్నారు. వారి మద్దతు కోసం బాబు ప్రయత్నిస్తుంటే జగన్ కూడా వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాలపై మంచి పట్టు ఉండే వర్గమే అగ్రవర్ణాలు. వారు తమ యుక్తితో ఏ పార్టీ మనుగడ సాధిస్తుంది? ఏ పార్టీ ప్రభావం చూపుతుంది అనే విషయాలపై కూలంకషంగా చర్చిస్తూ ఆ పార్టీకే పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతారు. దీంతో వారి మనసులో స్థానం సంపాదించుకునే క్రమంలో పార్టీలు కూడా వారి ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుుతున్నట్లు సమాచారం. దీంతో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వారి మద్దతు అవసరం అని గుర్తించి వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెబుతున్నారు.