
ఒలింపిక్స్ లో బాక్సర్ లవ్లీనా చరిత్ర సృష్టించింది. ఆమె ఇండియాకు మరో మెడల్ ఖాయం చేసింది. 64-69 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా అద్భుతమైన విజయం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్ పై 4-1 తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియాకు మరో మెడల్ ఖాయం.