MLA Roja: నగరి ఎమ్మెల్యే రోజాపై అసమ్మతి వర్గం తిరుగుబావుటా ఎగురవేసింది. ఇన్నాళ్లు చాపకింద నీరులా విస్తరించిన అసమ్మతి ప్రస్తుతం తమ మదిలో రగిలిన ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారున ఏకంగా రోజా ఫొటో లేకుండా ఫ్లెక్సీలు తయారు చేసి జగనన్న పుట్టిన రోజు వేడుకల్ని అపహాస్యం చేస్తున్నారు. ఏదైనా ఉంటే పార్టీలోనే చూసుకోవాలని గతంలోనే వారికి అల్టిమేటం జారీ అయినా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నగరి ఎమ్మెల్యే రోజా పై అసమ్మతి ఇంతకు తెగిస్తుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. రోజా ఫొటో లేని ఫ్లెక్సీలు తాము చూడలేమని ప్రజలు బహిరంగంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం అసమ్మతి వర్గంపై ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓ నేతతో జరిగిన వాగ్వాదంతో రగిలిన అసమ్మతి ప్రస్తుతం రోజా మెడకు చుట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఈ పరిణామాలను జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రోజా సిద్ధమైనా అసలు పట్టించుకుంటారో లేదో అనే సంశయాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. జగనన్న అండతోనే తాను రాజకీయాల్లో ఉన్నానని రోజా పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: Kapu Politics in AP: కాపుల రాజ్యాధికారం సరే.. నడిపించే నాయకుడు ఎవరు?
నాలుగు మండలాల నేతలందరు కలిసి పుత్తూరులో జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాటలు ఇప్పుడు బహిరంగం అయ్యాయి. దీంతో అధిష్టానం వాటిని పట్టించుకుని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందో లేక వేచి చూస్తుందో తెలియడం లేదు. ఏది ఏమైనా నగరిలో రోజాకు అసమ్మతి వర్గం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నది మాత్రం సత్యం.
Also Read: అధికార పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బర్త్ డే మరీ.. పోలీసుల స్వామిభక్తి చల్లగుండా!