https://oktelugu.com/

Amit Shah: కేసీఆర్ ట్రాప్ గురించి అమిత్ షాకు బాగానే తెలుసే?

Amit Shah: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపాయి. దీంతో రెండు పార్టీలకు చెందిన నేతలు విమర్శల దాడికి దిగుతున్నారు. హుజురాబాద్ ఓటమి తరువాత కేసీఆర్ బీజేపీపైనే విమర్శలకు దిగుతున్నారు. కేంద్రంపైనే నిందలు వేస్తూ తాను మాత్రం గురివింద గింజగా చెప్పుకుంటున్నారు. దీంతో దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. కేసీఆర్ అవినీతి పాలనపై ఆయుధాలు ఎక్కుపెడుతున్నారు. దీంతో రాష్ర్టంలో ఆసక్తికర […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 21, 2021 / 07:06 PM IST
    Follow us on

    Amit Shah: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపాయి. దీంతో రెండు పార్టీలకు చెందిన నేతలు విమర్శల దాడికి దిగుతున్నారు. హుజురాబాద్ ఓటమి తరువాత కేసీఆర్ బీజేపీపైనే విమర్శలకు దిగుతున్నారు. కేంద్రంపైనే నిందలు వేస్తూ తాను మాత్రం గురివింద గింజగా చెప్పుకుంటున్నారు. దీంతో దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. కేసీఆర్ అవినీతి పాలనపై ఆయుధాలు ఎక్కుపెడుతున్నారు. దీంతో రాష్ర్టంలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.

    Amit Shah

    ఈ మేరకు తెలంగాణ నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. కేసీఆర్ తీరుపై అనుసరించే విధానంపై తనదైన శైలిలో దిశా నిర్దేశం చేశారు. కేసీఆర్ ఆగడాలకు కళ్లెం వేస్తామని సూచించారు. తెలంగాణలో అధికారం కోసం మీరు పని చేయండి మిగతా విషయాలుమేం చూసుకుంటామని చెప్పారు. దీంతో నేతలంతా టీఆర్ఎస్ బాగోతాలపై వివరించారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ పంపిణీ చేసిన నల్లధనంపై కూడా చర్చ జరిగింది.

    ప్రభుత్వ పరంగా కేసీఆర్ ను ఎలా ఎదుర్కోవాలో చూస్తామన్నారు. దీంతో బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో ఇక అమీ తుమీ తేల్చుకోవడానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో రాద్దాంతం చేస్తున్న కేసీఆర్ కు కీలెరిగి వాత పెట్టేందుకు అమిత్ షా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా అమిత్ షా వలలో కేసీఆర్ చిక్కడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.

    Also Read: Telangana: ధాన్యం కొనుగోళ్లు: తప్పు తెలంగాణదే అన్నట్టు?

    ఈ నేపథ్యంలో కేంద్రంపై బురదజల్లే క్రమంలో కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు అమిత్ షా పరిశీలిస్తున్నారు. అన్నింటికి కలిపి ఒకే కౌంటర్ ఇచ్చేందుకు పక్కా ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి కేసీఆర్ కు మూడిందనే చెబుతున్నారు. అమిత్ షా తో పెట్టుకుంటే అంతే సంగతి ని చెబుతున్నారు. కానీ కేసీఆర్ ఏ మేరకు బతికి బట్ట కడతాడో వేచి చూడాల్సిందే.

    Also Read: TRS vs BJP: బీజేపీకి చావుడప్పు కొట్టిన టీఆర్ఎస్

    Tags