https://oktelugu.com/

Pawan Kalyan: 2024 ఎన్నికల్లో పవన్ పవర్‌ఫుల్ అస్త్రాన్ని వాడబోతున్నారా.. అందుకే ధైర్యంగా ఉన్నారా?

Pawan Kalyan: రాజకీయాల్లో రాణించాలంటే నాయకులకు ఉండాల్సింది పాపులారిటి.. ఆ తర్వాత వ్యుహాలు కూడా అవసరమే. ప్రజలు మనల్ని నమ్మేలా చేయగల వాక్చాతుర్యం కూడా ఉండాలి. మన వెంట ఒకరు నడుస్తున్నారంటే నేనున్నానంటూ భరోసా ఇచ్చే ధైర్యం ఉండాలి. దాంతో పాటే ఇతర పార్టీల ప్రశ్నలకు గట్టిగా కౌంటర్లు వేస్తుండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది నాయకుడు జనంలో ఉండాలి. అవి చాలు జనాలు అధికారం కట్టబెట్టడానికి.. గతంలో ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ వీరంతా ఇలా అధికారంలోకి వచ్చినవారే.. చంద్రబాబు […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 21, 2021 7:44 pm
    Follow us on

    Pawan Kalyan: రాజకీయాల్లో రాణించాలంటే నాయకులకు ఉండాల్సింది పాపులారిటి.. ఆ తర్వాత వ్యుహాలు కూడా అవసరమే. ప్రజలు మనల్ని నమ్మేలా చేయగల వాక్చాతుర్యం కూడా ఉండాలి. మన వెంట ఒకరు నడుస్తున్నారంటే నేనున్నానంటూ భరోసా ఇచ్చే ధైర్యం ఉండాలి. దాంతో పాటే ఇతర పార్టీల ప్రశ్నలకు గట్టిగా కౌంటర్లు వేస్తుండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది నాయకుడు జనంలో ఉండాలి. అవి చాలు జనాలు అధికారం కట్టబెట్టడానికి.. గతంలో ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ వీరంతా ఇలా అధికారంలోకి వచ్చినవారే.. చంద్రబాబు మాత్రం తన రాజకీయ వ్యూహాలతో కొన్నిసార్లు, రాజకీయ సమీకరణాలు, పొత్తులతో అధికారంలోకి వచ్చారు.

    Pawan Kalyan

    Pawan Kalyan

    పవన్ ఏం ఆలోచిస్తున్నారు..

    2014 ఎన్నికల ముందు వైసీపీ పార్టీ పూర్తిగా జనంలోనే ఉంది. పాదయాత్ర పేరుతో జగన్ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ప్రజల గడపగడపకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ విధంగా ప్రజలకు జగన్ పై నమ్మకం ఏర్పడింది. అందుకే గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు.. అదే సమయంలో జనసేన మాత్రం కేవలం ఎన్నికల ర్యాలీలతో సరిపెట్టుకుంది. పవన్ ఎక్కడ సభపెట్టినా జనాలు భారీగా వచ్చారు. కనీసం 10 నుంచి 20 సీట్లు ఖాయం అనుకున్నారు. కానీ పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. జనసేన పార్టీ నుంచి ఓకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. చివరకు ఆయన కూడా వైసీపీకి జై కొట్టాడు.

    పవన్ ధైర్యం అదేనా.. ఏ అస్త్రం వాడనున్నారు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా బిజీలో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే డబ్బు పోగేసుకుంటున్నారు. అందుకోసమే సినిమాలు తీస్తున్నానని నిర్మోహమాటంగా చెప్పారు. అయితే, పవన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే ఆయన బలం.. ఈ సారి అభిమానులను ఎన్నికల టైంలో ఒకేతాటి మీదకు తీసుకొచ్చేందుకు చూస్తున్నారట.. అంతేకాకుండా ఏపీలో ప్రస్తుతం కాపు సామాజిక వర్గం పవన్‌ పట్ల సానుకూలంగా ఉన్నారట.. రాబోయే ఎన్నికల్లో వాళ్లు జనసేనకు మద్దతు ఇవ్వాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వం కాపులను చిన్న చూపు చూస్తున్నారని.. మరోవైపు టీడీపీ పరిస్థితి బాలేకపోవడంతో కాపు వర్గం మొత్తం జనసేనవైపు చూస్తోందని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు.

    Also Read: Kapu Politics in AP: కాపుల రాజ్యాధికారం సరే.. నడిపించే నాయకుడు ఎవరు?

    అంతేకాకుండా ఎన్నికలు దగ్గర పడగానే ఏదో ఒక పార్టీ తనతో పొత్తుపెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటారని పవన్ అంచనా వేస్తున్నారట.. రాబోయే ఎన్నికల్లో జగన్ను ఒంటరిగా ఢీకొట్టడం ఏ పార్టీ వల్ల కాదు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి పవన్‌తో పొత్తుకు సిద్ధం కాబోతున్నారని తెలుస్తోంది. పవన్ ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీని జనం నమ్ముతారా? అంటే కష్టమే.. అలాంటి టైంలో పవన్ టీడీపీతో పొత్తుపెట్టుకుంటే తప్పకుండా ప్రజలు పవన్‌ను ఆశీర్వదిస్తారు. కనీసం 50 నుంచి 60 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తే.. అటు టీడీపీ మద్దతు.. ఇటు తన అభిమాన గణంతో సుమారు 40 స్థానాల్లో జనసేన జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

    Also Read: అధికార పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బర్త్ డే మరీ.. పోలీసుల స్వామిభక్తి చల్లగుండా!

    Tags