https://oktelugu.com/

Shyam Singha Roy: ఆ పాత్ర కోసం 15 గెటప్ లు ట్రై చేశా: నాని

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న సినిమా “శ్యామ్ సింగరాయ్”. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబ‌ర్ 24 తెలుగుతో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేస్తున్నారు. మొదటిసారిగా ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 11:06 AM IST
    Follow us on

    Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న సినిమా “శ్యామ్ సింగరాయ్”. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబ‌ర్ 24 తెలుగుతో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేస్తున్నారు. మొదటిసారిగా ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ టీమ్ ప్రమోషన్లను భారీగా ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో నాని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం బెంగాలీ రచయితగా తన పాత్రలో ఆకర్షణీయంగా కనిపించడం కోసం తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చానని నాని చెప్పాడు.

    nani revealed interesting details about his role in shyam Shyam Singha Roy movie

    Also Read: నాని శ్యామ్ సింగరాయ్ స్టోరీ లీక్… రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ షేడ్స్ !

    ఈ సినిమాలో నాని పోషించే పాత్రలలో ఒకదాన్ని ఎంచుకోవడానికి ముందు చాలా గెటప్‌లను ప్రయత్నించామని చెప్పుకొచ్చాడు. నాని ఈ చిత్రంలో సామాజిక సంస్కర్త, విప్లవ రచయితగా తన పాత్రను క్లుప్తంగా మార్చాలని కోరినట్లు పేర్కొన్నాడు. “లుక్ ఇంటెన్స్‌గా కనిపించనప్పటికీ, మేకోవర్ కొంచెం కష్టమైంది. “శ్యామ్‌ సింగ రాయ్‌ సినిమాలో ప్రస్తుత లుక్‌ని ఫిక్స్‌ చేసుకునే ముందు దాదాపు 15 గెటప్‌లు ట్రై చేశాను అంటూ నాని రివీల్ చేశాడు. నాని ఈ పాత్రలో కొంచెం బొద్దుగా కనిపించినప్పటికీ ఆయన బరువు పెరగలేదని… హెయిర్ స్టైల్, మీసాలు, డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం మార్చినట్లు తెలిపారు.

    Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ హైలైట్స్.. అంచనాలు తలకిందులైన వేళ..!