దేశ ప్రజలకు ప్రధానమంత్రి మోదీ దీపావళి గిప్ట్ గా పేర్కొంటో పెట్రోల్ పై రూ.5, డీజిల్ పైరూ.10 తగ్గించారు. దీంతో పెట్రోల్ పై ఉన్న ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దీంతో ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు రూ.5 మేరకు తగ్గించారు. పంజాబ్ రాష్ట్రం రూ. 10 పెట్రోల్ రేట్ తగ్గించింది. దీంతో అక్కడి ప్రజలకు రూ.15 తగ్గినట్లయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తగ్గింపు ఉంటుందని భావించారు. కానీ తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఖరాఖండిగా తాము పెట్రోల్ రేటు తగ్గించమని ప్రెస్ మీట్లు పెట్టి మరీ తేల్చారు. అయితే కేంద్రం వసూలు చేస్తున్న సెస్ పై మాత్రం పోరాడుతా మన్నారు. గంటల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇలాంటి ప్రకటన చేయడంపై ఆసక్తిగా మారింది.

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీతో సంప్రదింపులు జరుపుతూ పరోక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. వీరు ఎన్డీయే లోని సభ్యులు కాకపోయినా మోదీ తీసుకున్న నిర్ణయాలకు ఓకే చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్, వైసీపీ నాయకులు ఓటేశారు. అయితే వ్యవసాయ చట్టాలకు మాత్రం జగన్ సపోర్టు చేసినా.. కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇక అప్పుడప్పుడూ మోదీని ఇటు కేసీఆర్, అటు జగన్ కలుస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా పెట్రోల్ ధరల పెంపు కారణంగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా విమర్శలురావడంతో కొంచెం ధరలు తగ్గించారు. అయితే ఆదివారం ఏపీ జగన్ పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారు..? ఎందుకు తగ్గించారు..? ఇందులో రాష్ట్రాల ప్రమేయం ఏంటి..? అనే విషయాలను వివరిస్తూ న్యూస్ పేపర్లలో ప్రకటనజలు జారీ చేశారు. ఇక సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కేంద్ర తీరును ఎండగట్టారు. పెట్రోల్ ధరలపై కేంద్రం నాటకం ఆడుతుందని అన్నారు. తమ అవసరాలకు పెంచుకొని ఇప్పుడు కొంచెం తగ్గించి..మిగతాది రాష్ట్రాలను తగ్గించమనడం ఎంత వరకున్యాయం అని ప్రశ్నించారు.
పెట్రోల్ ధరలపై వచ్చే ఆదాయాన్ని డివిజబుల్ ఫూల్ లోకి రాకుండా సెస్ లు, సర్ ఛార్జీలు రూపంలో వసూలు చేస్తున్నారని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు. వీటిపై ఇప్పటికీ వ్యాట్ విధానాన్నే అవలంభిస్తున్నారని, ఆ నిబంధనల ప్రకారం రాష్ట్రాలకు 41 శాతం దక్కుతుందన్నారు. కానీ మోదీ సర్కార్ మాత్రం రాష్ట్రాలపై సెస్ విధానాన్ని ప్రయోగిస్తూ అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఏపీ జగన్ ఇచ్చిన ప్రకటనల్ పెట్రోల్, డీజీల్ ధరలపై కేంద్రం 3,35,000 కోట్లు వసూలు చేస్తే అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం రూ.19,745 కోట్లు మాత్రమేనని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న సెస్ విధానం ఆందోళన చేస్తామని కేసీఆర్ అన్నారు. పెట్రోల్, డీజీల్ పై సెస్ విధానాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంటే పెట్రోల్ రేటు రూ.77కి వస్తుందన్నారు. అలా చేయని పక్షంలో కేంద్రంలో పోరాడుతామని హెచ్చరించారు. అయితే మొత్తగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపణలు చూస్తే రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు తాము తగ్గించే ప్రసక్తే లేదన్నట్లు వాదించారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ రేటు తగ్గింపుతో మరించి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని అన్నారు.