ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు లక్ష రూపాయలకు పైగా వేతనం లభించనుంది.
ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఎంపికైన వాళ్లు హ్యూమన్ స్పేస్ ఫైట్ సెంటర్ లో పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. 1,12,400 రూపాయలు ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనంగా లభించనుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎక్కువ పోటీ ఉండే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో హిందీలో మాస్టర్ డిగ్రీ ఉండగా డిగ్రీ లెవెల్ లో ఇంగ్లీష్ ను చదివి ఉండాలి.
ఇంగ్లీష్ కాకుండా హిందీ కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉన్నవాళ్లు హిందీ లేదా ఇంగ్లీష్ ఎలక్టివ్ సబ్జెక్ట్ గా ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ లేదా ఇంగ్లీష్ మాస్టర్ డిగ్రీ చదివిన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ విద్యార్హతలతో పాటు హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీ భాషకు ట్రాన్స్ లేషన్ సర్టిఫికెట్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రాన్స్ లేషన్ లో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఇతర వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. https://www.isro.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.