https://oktelugu.com/

Ravi Teja: శరవేగంగా రామారావు షూటింగ్​.. మారేడుమల్లిలో యాక్షన్​ సీన్స్​ చిత్రీకరణ!

Ravi Teja: క్రాక్​ సినిమాతో సూపర్​ హిట్​ కొట్టిన మాస్​ మహారాజ రవితేజ… ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం టైగర్​ రామారావుతో పాటు, కిలాడి, ఢమాక, రావణాసుర వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా శరత్​ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రామారావు ఆన్​ డ్యూటీ. సూధాకర్​ చెరుకూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్​ రవితేజ సరసన నటించనుంది. వేణు తొట్టెంపూడి, రజీషా విజయన్​, నాజర్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 8, 2021 / 11:18 AM IST
    Follow us on

    Ravi Teja: క్రాక్​ సినిమాతో సూపర్​ హిట్​ కొట్టిన మాస్​ మహారాజ రవితేజ… ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం టైగర్​ రామారావుతో పాటు, కిలాడి, ఢమాక, రావణాసుర వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా శరత్​ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రామారావు ఆన్​ డ్యూటీ. సూధాకర్​ చెరుకూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్​ రవితేజ సరసన నటించనుంది. వేణు తొట్టెంపూడి, రజీషా విజయన్​, నాజర్​ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    తాజాగా, ఈ సినిమా షూటింగ్​ తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరుపుకునేందుకు సిద్ధమైంది.  షెడ్యూల్​లో భాగంగా రవితేజపై ఇక్కడ థ్రిల్లింగ్​ యాక్షన్​ సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాతలు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఇక మారేడుమిల్లి షెడ్యూలు ముగిసిన వెంటనే.. పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లలున్నట్లు తెలుస్తోంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపంచనున్నారు. క్రాక్​ హిట్​ సినిమా తర్వాత ఒకే సారి ఇన్ని ప్రాజెక్టులను ఒప్పుకోవడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    మరోవైపు టైగర్​ నాగేశ్వరరావు సినిమాలో దొంగగా అలరించనున్నారు. స్టువర్టుపురంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆసలు ఈ నాగేశ్వరరావు ఎవరు?. ఆయన జీవితంలో చోటుచేసుకున్న మలుపులు ఏంటో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు రావణాసుర సినిమాలోనూ విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన పోస్టర్​లో పదితలల రావణుడిగా అలరించారు రవితేజ. మరి ఎప్పుడూ లేనంత వరుస ప్రాజెక్టులతో విభిన్న పాత్రల్లో కనిపించనున్న రవితేజను.. లక్​ ఎలా పలకరించనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.