https://oktelugu.com/

KCR-Jagan: జగన్ , కేసీఆర్ లకు గొప్ప ఇబ్బందే వచ్చిందే?

KCR-Jagan: పెద్దలు చెబుతుంటారు మన వీపు మనకు కనిపించు అని. ఇప్పుడు తెలుగు స్టేట్లలో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ తమ పాలన బాగుందని జబ్బలు చరుచుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులే వస్తున్నాయి. సామాన్య మానవుడికి ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సి రావడమే దారుణం. దీంతో వారు విసిగి వేసారి పోతున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం మా పాలన భేషుగ్గా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో యూత్ ఫర్ యాంటీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 24, 2021 / 10:57 AM IST
    Follow us on

    KCR-Jagan: పెద్దలు చెబుతుంటారు మన వీపు మనకు కనిపించు అని. ఇప్పుడు తెలుగు స్టేట్లలో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ తమ పాలన బాగుందని జబ్బలు చరుచుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులే వస్తున్నాయి. సామాన్య మానవుడికి ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సి రావడమే దారుణం. దీంతో వారు విసిగి వేసారి పోతున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం మా పాలన భేషుగ్గా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి.

    KCR-Jagan

    ప్రభుత్వ యంత్రాంగాలు అవినీతి ఊడల్లా మారాయని వాపోతున్నారు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసుకుని ప్రజలను జలగల్లా పీడిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వాలు మాత్రం తాము అవినీతిని దరిచేరనీయడం లేదని చెప్పుకుంటున్నా నేతల్లోనే చాలా మంది అవినీతి పరులుండటం విశేషం. దీంతో ప్రభుత్వాల ప్రతిష్ట మసకబారుతోంది. చిన్న పని అయినా చిల్లర లేనిదే కావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు.

    Also Read: స‌ర్వేల‌తో హ‌డ‌లెత్తిస్తున్న కేసీఆర్‌.. ఎమ్మెల్యేల్లో గుబులు..!

    ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ కు, ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు గడ్డు పరిస్థితులే ఎదురు కానున్నాయి. పైగా అధికారుల్లో జవాబుదారీ తనం లోపిస్తోంది. పనులు సక్రమంగా సాగకపోగా ప్రశ్నిస్తే కూడా సమాధానాలు రావడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచగొండుల తీరుతో వేగలేకపోతున్నామని బహిరంగంగా చెబుతున్నారు.

    అత్యధికంగా రెవెన్యూ శాఖలో అవినీతి తాండవం చేస్తోంది. ఇక్కడ ప్రతి పని కావాలన్నా చేతులు తడపాల్సిందే. లేకపోతే పని జరగడం లేదు. తరువాత స్థానాల్లో పోలీసు, రిజిస్రేషన్, పురపాలక శాఖల్లో అవినీతి పేరుకుపోయింది. నాయకుల్లో కూడా అవినీతికి పెద్దపీట వేసే వారుండటం గమనార్హం. ఇరు ప్రాంతాల్లో 92 శాతం మంది అధికారులు అవినీతిపరులేనని తేల్చింది. దీంతో అవినీతి ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుడికి మాత్రం ఏ మాత్రం ప్రయోజనాలు దక్కకపోగా పనులు కూడా సక్రమంగా జరగకపోవడం దారుణమే.

    Also Read: వైసీపీపై దాడికి రెడీ అయిన టీడీపీ మీడియా.. వెనుక భారీ ప్లాన్లు?

    Tags