Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీని విజయతీరాలకు చేర్చాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీలో సమూల మార్పులు చేపడుతున్నారు. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. పని చేసేవారిని గుర్తించి పని చేయని వారిని పక్కన పెట్టేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే పార్టీ గాడిన పడుతుందని అనుకుంటున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు కదలాలని సూచిస్తున్నారు.
మరోవైపు పొత్తులో భాగంగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన మదిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీని కోసం కొన్ని నియోజకవర్గాలను త్యాగం చేసేందకు వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తో ఏర్పరుచుకునే పొత్తులో కొన్ని చోట్ల వారికి టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడొచ్చు. అందుకే వారికి అనుకూలంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు. దీంతో బాబు దూర దృష్టితో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు పోటీ వ్యవస్థ.. భారీ స్కెచ్ గీశాడుగా?
ఇప్పటికే అధికారం పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వెన్నంటి ఉండే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి సేవలందించిన వారిని వీడనాడొద్దనే భావంతో వారికి టికెట్టు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అభ్యర్థులు బలంగా లేకపోతే పక్కనపెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. పనితీరు మార్చుకుని ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నా లెక్కచేయని వారి లెక్కలు తేల్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
మొహమాటాలకు పోతే పని కావడం లేదు. నిక్కచ్చిగా ఉంటేనే సరి అని భావం బాబులో వస్తోంది. అందుకే నేతలకు పదేపదే చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కదలాలని చెబుతున్నారు. ఇందుకోసం అన్ని దారులు వెతుకుతున్నారు. పార్టీని అధికారంలోకి తేవడమే అస్ర్తంగా సిద్ధమవుతున్నారు. ఎంత కఠినమైన నిర్ణయాలను తీసుకోనైనా నేతల్లో మార్పులు తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.