Radhe Shyam: ఈ సినిమాకు 4 ఏళ్లైతే.. కథకు మాత్రం 18 ఏళ్లు- రాధేశ్యామ్​ డైరక్టర్​

Radhe Shyam: హుబలితో పాన్​ఇండియా స్టార్​గా గుర్తింపు పొందిన ప్రభాస్​.. ఆ తర్వాత వరుసగా అన్నీ అదే రేంజ్​ సినిమాలు తీస్తూ కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధే శ్యామ్​లోనూ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాపై బారీగా అంచనాలు పెంచుతూ వస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఫొటోలు, పాటలు, టీజర్లు విడుదల చేస్తూ మరింత హైప్​ను క్రియేట్ చేసింది. కృష్ణంరాజు […]

Written By: Sekhar Katiki, Updated On : December 24, 2021 4:35 pm
Follow us on

Radhe Shyam: హుబలితో పాన్​ఇండియా స్టార్​గా గుర్తింపు పొందిన ప్రభాస్​.. ఆ తర్వాత వరుసగా అన్నీ అదే రేంజ్​ సినిమాలు తీస్తూ కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధే శ్యామ్​లోనూ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాపై బారీగా అంచనాలు పెంచుతూ వస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఫొటోలు, పాటలు, టీజర్లు విడుదల చేస్తూ మరింత హైప్​ను క్రియేట్ చేసింది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది.

Radhe Shyam Trailer Talk

Also Read: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?

తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​ సిటీలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ.. సినిమా తీయడానికి నాలుగేళ్లు పడితే.. కథ రాయడానికి 18 ఏళ్లు పట్టిందని అన్నారు. తన గురువు చంద్రశేఖర్ యేలేటి దగ్గర ఈ సినిమా పాయింట్ విన్నానని అన్నారు. 18 ఏళ్లు ఇండియాలోని పెద్దపెద్ద రైటర్స్​తో కలిసి ఈ కథను రాయించాం. కానీ, కథ క్లైమాక్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ టైంలో ఈ కథ ఎవరికి రాసిపెట్టిందో అని మా గురువుగారు అన్నారు. ఇప్పుడు తెలిసింది ఇది ప్రభాస్ కోసమేనని.. అని చెప్పుకొచ్చారు.

ఓ ఫిలాసఫీని కథలా రాసి ఆయనకు చెప్పా. ఆయనకు కూడా బాగా నచ్చింది. సినిమాలో ఫైట్లు, ఛేజ్​లు ఉండవు. అమ్మాయికి, అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలు ఉంటాయి. ఇదొక అందమైన ప్రేమ కథ. ఈ నాలుగేళ్లు ఎంతో సపోర్ట్​గా నిలిచిన టీమ్​కు ధన్యవాదాలు అంటూ స్పీచ్ ముగించారు.

Also Read: ఆయన ఓ చిన్నపాటి దేవుడిలా కనిపిస్తున్నారు కదా?- ప్రభాస్​