https://oktelugu.com/

తమిళం వైపు ఆ ఇద్దరు సీఎంల చూపు…?

తెలుగు ముఖ్యమంత్రులు దక్షిణాన తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తమకు సరిగా సపోర్టు చేయడం లేదన్న అక్కసుతో దక్షిణాన తమ పవర్ ఏంటో నిరూపించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కెసిఆర్ తమిళనాడు ఎన్నికలపై దృష్టి సారించారు. అక్కడ తమకు ఒక బలమైన స్నేహితుడు దొరుకుతాడని ఆశిస్తున్నారు. ఇప్పటికే స్టాలిన్ తో జగన్, కేసీఆర్ కు మంచి స్నేహం ఉంది. ఎన్నికల్లో తమిళ ముఖ్యమంత్రి పీఠాన్ని […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 7, 2021 10:52 am
    Follow us on

    KCR Jagan
    తెలుగు ముఖ్యమంత్రులు దక్షిణాన తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తమకు సరిగా సపోర్టు చేయడం లేదన్న అక్కసుతో దక్షిణాన తమ పవర్ ఏంటో నిరూపించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కెసిఆర్ తమిళనాడు ఎన్నికలపై దృష్టి సారించారు. అక్కడ తమకు ఒక బలమైన స్నేహితుడు దొరుకుతాడని ఆశిస్తున్నారు. ఇప్పటికే స్టాలిన్ తో జగన్, కేసీఆర్ కు మంచి స్నేహం ఉంది. ఎన్నికల్లో తమిళ ముఖ్యమంత్రి పీఠాన్ని స్టాలిన్ అధిష్టిస్తే.. కొంతమేర బీజేపీ దూకుడుకు కళ్లెం వేయవచ్చనే భావన ఇద్దరు తెలుగు సీఎంలలో ఉంది. మొన్నటి బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు పూచికపుల్లంత విలువ కూడా లేకపోయింది. రకరకాల రాజకీయ కారణాలతో అణిగిమణిగి ఉండాల్సి వస్తోంది. వీరిద్దరి వ్యక్తిగత, రాజకీయ అవసరాలపై కేంద్రం దెబ్బతీస్తుందనే భయంతో వీరు మిన్నకుండిపోతున్నారని రాజకీయ విశ్లేషకుల భావన.

    Also Read: విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’.. 32మంది ప్రాణత్యాగం.. 1966లో జరిగిన సంఘటనలేంటి..?

    పెరియార్ రామస్వామి, అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి వంటినాయకుల తరువాత ద్రవిడవాదం బలహీన పడుతుం దని చెప్పవచ్చు. అయితే దానికి కొంతమేర న్యాయం చేసే నేతగా స్టాలిన్ నిలదొక్కుకుంటున్నారు. రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశంతో తమిళనాట కొంత చక్రం తిప్పుతారని అంతా భావించారు. అనూహ్యంగా తెరవెనుకే ఉంటానంటూ.. తలైవా చెప్పేశాడు. స్టాలిన్ రాజకీయ కక్ష సాధింపులు తట్టుకోవడం కష్టమని భావించాడు. బీజేపీని గట్టిగా నిలదీయగల నాయకుడు స్టాలిన్ మాత్రమేనని తమిళనాడులో విశ్వసిస్తున్నారు.

    ఎన్డీఏ హయాంలో రాష్ట్ర హక్కులు దెబ్బ తింటున్నాయి. దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడు నుంచే హక్కుల పోరాటం మొదలు కావాలని రాజకీయ నేతలు ఆశిస్తున్నారు. కేసీఆర్ ద్రవిడ నాయకుడిగా రూపుదాల్చడం కష్టం. ప్రాంతీయ అస్తిత్వంతో కూడిన తెలంగాణ నాయకుడిగానే ఆయనకు పేరుంది. జగన్ సొంత రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాట ఎన్నికల్లో డీఎంకే గెలుపు సాధిస్తే.. ప్రాంతీయ కూటమికి ఎంతో ఆస్కారం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.

    Also Read: జయహో ఇండియా: ప్రపంచ దేశాలకు మన టీకానే.. మనదే పెద్దన్న పాత్ర

    స్టాలిన్ బలమైన నాయకుడే.. కానీ డీఎంకేలో అంతర్గత పోరు ఎక్కువ. రానున్న ఎన్నికల్లో అతడి రాజకీయ జీవితానికి ఇదో పరీక్ష. దక్షిణ తమిళనాట అన్న అళగిరి పార్టీని దెబ్బతీస్తారు. భుజాన ఎత్తుకున్న ఏఐఏడీఎంకే విజయానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. డీఎంకేకు ఎదురు వెళ్లలేక వెనక్కి తగ్గిన రజినీకాంత్ పరోక్షాం ఏఐఏడీఎంకే, బీజేపీలకే జై కొట్టవచ్చు.

    కాంగ్రెస్, వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో దక్షిణ భారత దేశానికి అధిక ప్రాధాన్యత ఉండేది. కానీ ప్రస్తుతం మోదీ కాలంలో పూర్తిగా ప్రాబల్యం కోల్పోయింది. ఒక్క కర్నాటక మినహా మిగితా నాలుగు చోట్ల ప్రతిక్షాలే అధికారంలో ఉండడం ఇందుకు కారణం. తమిళనాడులో మిత్రపక్షమే అయినా సొంతబలం లేదు. ఈ స్థితిలో రానున్న రోజుల్లో దక్షిణ భారత దేశానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. తన రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతుంది. ఆర్థికంగా నష్టపోతుంది. అందువల్ల ప్రాంతీయంగా బలంగా ఉన్న జగన్, కేసీఆర్, స్టాలిన్, దేవెగౌడ వంటివారు చేతులు కలిపితే.. ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకు తమిళనాట ఎన్నికలు వేదిక అయితే ప్రయోజనకరంగా ఉండొచ్చు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్