https://oktelugu.com/

చైనానే సూపర్ యాప్ లు ఎందుకు తయారు చేస్తోంది..?

మనకు సినిమా టికెట్లు కావాలన్నా.. హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకోవాలన్నా.. అవసరమైన వస్తువును కూర్చున్న కాడికి రావాలన్నా చెమట చుక్క ఒడవాల్సిన అవసరం లేదు. అరచేతిలో మొబైల్ ఉండి.. దానిపై నాలుగు వేళ్లు గిరగిరా కదిలిస్తే చాలు.. మనం అనుకున్నది దక్కించుకోవచ్చు.. అవును మనకు అవసరమున్న ఏ వస్తువైనా, సేవలైనా పొందడానికి ఇప్పుడు మొబైల్ వాహకంగా మారింది. అయితే మొబైల్ అంటే మొబైల్ కాదు.. అందులో ఉండే యాప్ లు అని చెప్పుకుంటే బాగుంటుంది. ఆయా రంగాలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 7, 2021 10:58 am
    Follow us on

    మనకు సినిమా టికెట్లు కావాలన్నా.. హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకోవాలన్నా.. అవసరమైన వస్తువును కూర్చున్న కాడికి రావాలన్నా చెమట చుక్క ఒడవాల్సిన అవసరం లేదు. అరచేతిలో మొబైల్ ఉండి.. దానిపై నాలుగు వేళ్లు గిరగిరా కదిలిస్తే చాలు.. మనం అనుకున్నది దక్కించుకోవచ్చు.. అవును మనకు అవసరమున్న ఏ వస్తువైనా, సేవలైనా పొందడానికి ఇప్పుడు మొబైల్ వాహకంగా మారింది. అయితే మొబైల్ అంటే మొబైల్ కాదు.. అందులో ఉండే యాప్ లు అని చెప్పుకుంటే బాగుంటుంది. ఆయా రంగాలకు చెందిన సంస్థలు తమ సేవలందించేందుకు నేరుగా కాకుండా కొన్ని యాప్ ల ద్వారా వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. యాప్ సంస్థలు  పారదర్శకంగా వినియోగదారులకు మేలు చేసే విధంగా నడుచుకోవడంతో అందరూ యాప్ లను నమ్ముకుంటున్నారు.

    మొబైల్ యాప్ క్రియేట్ చేయడంలో చైనా ఒక ఆకు ఎక్కువే చదివింది. ఇతర దేశాల కంటే వినూత్నంగా చైనా ఆన్లైన్ బిజినెస్ చేయడాన్ని నేర్చుకుంది. ఇక్కడి డేటా చట్టాలు కూడా భిన్నంగా ఉండడంతో వ్యాపార సేవలకు మరింత అనుకూలంగా మారింది. దీంతో చైనీయులు టెలీఫోన్ నుంచి మొబైల్ ఫోన్ కు అతి తొందరగా మారిపోయారు. అంతేస్థాయిలో డేటా వినియోగానికి అలవాటు పడ్డారు. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగించాలంటే పెద్ద నిబంధనలు ఉండవు. అందుకే ప్రతీ ఒక్కరూ మొబైల్ వాడుతూ అందులోని యాప్ ల ద్వారా తమ కార్యకలాపాలు చేస్తారు. అంతేకాకుండా కొందరు ఆన్ లైన్ ద్వారానే వ్యాపారాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఇక్కడ సూపర్ యాప్ లను తయారు చేసేందుకు ఆస్కారం లభించింది.

    చైనాతో కోల్డ్ వార్ కారణంగా భారత్ కొన్ని యాప్ లను నిషేధించింది. వీటిలో ‘వీ చాట్ ’ కూడా ఉంది. అయితే చైనాలో ‘వీ చాట్ ’యాప్ కు విశేష ఆదరణ ఉంది. చైనాకు చెందిన ‘టెన్సెంట్’ అనే టెక్నికల్ సంస్థ 2011లో ‘వీ చాట్’ను పుట్టించింది. మొదట ఈ యాప్ మేనేజింగ్ కార్యకలాపాలు చేసినా ఆ తరువాత ఇతర సర్వీసులు చేయడం ప్రారంభించింది. దీనికి యూజర్లు పెరగడంతో అనేక థర్డ్ పార్టీ కంపెనీలు వీ చాట్ ద్వారా బిజినెస్ చేస్తున్నాయి. ఇందులో దాదాపు 10 లక్షల సర్వీసులు చేస్తున్నట్లు సమాచారం. వీచాట్ తరహాలోనే చైనాకు చెందిన ‘ఆలీ పే’ ను యాంట్ గ్రూప్ అనే సంస్థ తయారు చేసింది. దీనికి వందల కోట్ల యూజర్లు ఉండడం విశేషం.

    మరి ఇంత ప్రజాధరణ ఉన్న యాప్ ను భారత్ తో సహా అమెరికా ఎందుకు నిషేధించింది..? దీని వల్ల జరిగే నష్టాటేంటో చూద్దాం..

    అనేక ఆన్ లైన్ ట్రాన్షాక్షన్లు నిర్వహించే వీ చాట్ నిర్వాహకులు తమ యాప్ లోని డాటాను చైనా అధికార పార్టీ కమ్యూనిస్టుకు అప్పజెప్పాల్సి ఉంటుంది. చైనాకు వీ చాట్ సర్వీసులపై సెన్సార్ షిప్ ఉన్నట్లు గుర్తించామని ‘ది ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ ’ తెలిపింది. వీ చాట్ లో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ అనే ఆప్షన్ ఉండదు. దీంతో దీనిని తయారు చేసిన టెన్సెంట్ సంస్థకు యూజర్ల డాటా ఈజీగా తీసుకునే అవకాశం ఉంది. అయితే వీ చాట్ మాత్రమే కాకుండా చైనాకు చెందిన ఏ యాప్ అయినా తమ డేటానంతా కమ్యూనిస్టు చైనా ప్రభుత్వానికి  అప్పజెప్పాల్సి ఉంటుంది. డేటాలో ఇలా భద్రత లోపాల వల్లే కొన్ని దేశాలు చైనా యాప్ లను నిషేధించాయి.

    పాశ్చాత్య దేశాలకు ధీటుగా యాప్ లను తయారు చేసేందుకు ఆగ్నేయాసియా దేశాలు నడుం బిగించినట్లు తెలుస్తోంది. చైనా లాగే తాము సూపర్ యాప్ లను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గ్రాబ్, గోజెక్, సీఈఏ అనే కంపెనీలు ప్రకటించాయి. ఇవి యాప్ లను రూపొందించేందుకు ఇప్పటికే భారీగా నిధులను సమకూర్చుకున్నాయి. ఇండోనేషియాకు చెందిన ‘గోజెక్’ ఓ మోటార్ సైకిల్ హైరింగ్ కంపెనీతో పాటు, కార్ రైడ్స్, పేమేంట్స్ సర్వీసులను చేస్తోంది.

    ఏ యాప్ లు తయారు చేసినా డేటా భధ్రత విషయంలో వినియోగదారులు ఒక్కసారి ఆందోళన చెందితే ఇక యాప్ లను మరోసారి వాడే ఆస్కారముండదని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇండియాలోనూ కొన్ని చైనా యాప్ లకు ప్రత్యామ్నాయంగా తయారవుతున్నాయి. చైనా టిక్ టాక్ యాప్ నకు ప్రత్యామ్నాయంగా ఎన్నో యాప్ లు భారత్ లో పుట్టుకొస్తున్నాయి. కానీ సర్వీసుల విషయంలో మాత్రం భారత్ ప్రజలు యాప్ లను నమ్మడం లేదనే చెప్పవచ్చు.