https://oktelugu.com/

భారత్ తీరుకు ఫిదా అయిన నేపాల్..

నిన్న మొన్నటి వరకు భారత్ పై కారాలు, మిరియాలు నూరిన నేపాల్ ఇప్పుడిప్పుడే తన వైఖరిని మార్చుకుంటోంది. ఖడ్గ ప్రసాద్ శర్మ సారథ్యంలోని ఖాట్మాండు సర్కారు కాస్త ఆలస్యమైనా వాస్తవాలు తెలుసుకుంటోంది. నిన్న మొన్నటి వరకు న్యూఢిల్లీపై కోపంగా ఉన్న నేపాల్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఎవరు స్నేహితులో.. ఎవరు శత్రువులో తెలుసుకుంటోంది. గత ఎనిమిది నెలలుగా ఉభయదేశాల సంబంధాలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అపోహలు తొలగి, అనుమానాలు వీడి.. మళ్లీ న్యూఢిల్లీ.. ఖాట్మాండు కలిసిమెలసి పని చేయడనికి విదేశాంగ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 7, 2021 / 10:41 AM IST
    Follow us on


    నిన్న మొన్నటి వరకు భారత్ పై కారాలు, మిరియాలు నూరిన నేపాల్ ఇప్పుడిప్పుడే తన వైఖరిని మార్చుకుంటోంది. ఖడ్గ ప్రసాద్ శర్మ సారథ్యంలోని ఖాట్మాండు సర్కారు కాస్త ఆలస్యమైనా వాస్తవాలు తెలుసుకుంటోంది. నిన్న మొన్నటి వరకు న్యూఢిల్లీపై కోపంగా ఉన్న నేపాల్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఎవరు స్నేహితులో.. ఎవరు శత్రువులో తెలుసుకుంటోంది. గత ఎనిమిది నెలలుగా ఉభయదేశాల సంబంధాలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అపోహలు తొలగి, అనుమానాలు వీడి.. మళ్లీ న్యూఢిల్లీ.. ఖాట్మాండు కలిసిమెలసి పని చేయడనికి విదేశాంగ మంత్రి గ్యవాలీ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని దౌత్య నిపుణులు అంటున్నారు.

    నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన ప్రధాన ఉద్దేశం భారత్ నుంచి కోవిడ్ టీకా కొనుగోలు చేయడం.. నిజానికి మిత్రదేశంగా చెప్పుకునే చైనా తన దగ్గర తయారయ్యే.. ‘సినోవాక్’ టీకా సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. తొలుత ఖాట్మాండు కూడా సుముఖత చూపింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక చర్యలు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ కారణాలు తెలియనప్పటికీ.. చివర్లో నేపాల్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. చైనా టీకా నాణ్యతపై అనుమనాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీకా సమర్థత 70శాతానికి మించి లేదని.. అందులో అసలు కరోనా వ్యాప్తికి కారణమైన చైనా ఉత్పత్తి నాణ్యతపై ప్రపంచవ్యాప్తంగా అనుమనాలు రావడంతో నేపాల్ సర్కారు భారత్ వైపు మొగ్గు చూపుతోంది.

    Also Read: విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’.. 32మంది ప్రాణత్యాగం.. 1966లో జరిగిన సంఘటనలేంటి..?

    భారత్ లో తయారయ్యే.. ‘కో వాగ్జిన్’టీకాను సుమారు 12 మిలియన్ల డోసులు తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ఇంటర్నెషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమోహన్ తో ఢిల్లీలోని నేపాల్ రాయబారి నీలాంబర్ ఆచారి చర్చలు జరిపారు. ఈ టీకాను ముందుగా కోవిడ్ వారియర్స్ కు అందిస్తారు. కేవలం టీకా సరఫరాకే నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన పరిమితం కాలేదు. ఇండో నేపాల్ ఆరో జాయింట్ కమిషనర్ చర్చల్లో భాగంగా విదేశాంగ మంత్రి జై శంకర్ తో ద్వైపాక్షిక అంశాలపై భేటీ అయ్యారు. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని కాలాపానీ, లిపూలేఖ్, లింపియాధురాల ప్రాంతాలు తమవేనంటూ.. నేపాల్ నాయకత్వం గత ఏడాది నానా యాగి చేసింది. చైనా సపోర్టుతో ఈ విషయాన్ని పార్లమెంటులో తీర్మానం చేసిన కొంత దూకుడును ప్రదర్శించింది. అంతేకాదు.. ఈ మేరకు కొత్త నేపాల్ చిత్రపటాన్ని సైతం విడుదల చేసింది.

    Also Read: జయహో ఇండియా: ప్రపంచ దేశాలకు మన టీకానే.. మనదే పెద్దన్న పాత్ర

    తాజాగా దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నేపాల్ వైఖరిలో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీలోని సీనియర్ నేత, మాజీ ప్రధాని ప్రచండతో విభేదాల కారణంగా ప్రధాని ఓలీ గత నెలలో పార్లమెంటు రద్దు చేశారు. ఈ విషయంలో చైనా ఓలీ పక్షాన నిలిచింది. ఓలి, ప్రచండ మధ్య రాజీ కుదిర్చేందుకు చైనా రాయబారి నేపాల్లో మధ్యవర్తిత్వం వహించాడు. చివరకు చైనా ప్రత్యేక బృందాన్ని పంపింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో భారత్ తటస్థంగా నిలిచింది. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని , అక్కడి పరిణామాలను గమనిస్తూ.. వేచి చూసింది.. ఆ తటస్థ తీరు నేపాల్ కు నచ్చిందని, అందువల్లే.. భారత్ తో బాంధవ్యాన్ని పునరుద్ధరించుకోవాలని నిర్ణయించినట్లు .. ఇందులో భాగంగానే విదేశాంగ మంత్రి పర్యటన అని దౌత్య నిపుణులు అంటున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్