
తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడిప్పుడే తన రాజకీయ పరిణతిని చాటుతున్నాడు. అందుకే దూకుడుగా వెళ్తుంటాడు. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దూకుడుతోపాటు చాణక్యం కూడా ఉంది. ఇక అంగ బలం, అర్ధ బలంలోనూ కేసీఆర్ సర్వ శక్తి సంపన్నుడు. ఆయనకు బలమైన అనుకూల మీడియా ఉంది. అలాంటి కేసీఆర్ ని సొంత గడ్డ మీద ఓడించేసి జబ్బలు చరుస్తోంది బీజేపీ ఇప్పుడు.
Also Read: పవన్ కళ్యాణ్ మళ్ళా మాట్లాడాడు
కేసీఆర్‌కు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆరేళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారు. ఎంత మంది సీనియర్ రాజకీయ నేతలను ఎలా లొంగబరుచుకోవాలో కూడా ఆయనకు తెలుసు. అందులో భాగంగానే ఇతర పార్టీల్లోని సీనియర్లను ఎలా తన పార్టీలోకి లాగారో కూడా అందరికీ తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనో రాజకీయ చాణక్యుడు. తెలంగాణ ఏర్పాటు నుంచీ ఏ ఎన్నికల్లోనూ ఓటమి ఎరగని నేత. అంతటి చరిత్ర కలిగిన ఆ నాయకుడిని దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ బోల్తా కొట్టించింది. గా కమలం పార్టీ ఏం చేస్తుందిలే అని ముందుగా లైట్ తీసుకున్నా.. తర్వాత సీరియస్‌గా పరిగణించాల్సి వచ్చింది.
ఇక ఏపీలో చూసుకుంటే.. అంతా వన్‌మాన్ షో. పార్టీ అయినా.. ప్రభుత్వం అయినా అన్నీ జగనే. అంతే తప్ప రెండో తరం లీడర్ షిప్ లేదు. జనాలు కూడా ఆయన్ని చూసే ఓట్లేశారు. కానీ సంస్థాగతంగా పార్టీని పటిష్టంగా ఇంకా నిర్మించుకోలేదు. ఈ దుస్థితే ఇప్పుడు వైసీపీని భయపెడుతోందట. ఉద్యమాలు చేయడంలోనూ, ప్రత్యర్థిని అష్ట దిగ్బంధనం చేయడంలోనూ కేసీఆర్‌ను మించిన మొనగాడు లేడు. అలాంటి ఆయనకే దుబ్బాక కాజా తినిపించిన బీజేపీకి.. ఏపీలో జగన్ సులువుగా దొరికేస్తాడా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Also Read: కెసిఆర్ మోడీపై సమరంలో పస ఉందా?
అంతేకాదు.. కేంద్రంపై, బీజేపీ కేసీఆర్ ఎప్పుటికప్పుడు తన అక్కసును వెల్లగక్కుతుంటే.. జగన్ మాత్రం మెతక వైఖరితో ఉంటున్నారు. దానికి ఆయన మీద ఉన్న కేసులు కూడా కారణమని ప్రత్యర్థులు అంటారు. అందుకే.. బీజేపీ ఈ సాకునే బాగా వాడేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జగన్ కి అకస్మాత్తుగా పెరిగిన మోడీ ఇమేజ్, బీజేపీ సవాళ్లు మరో వైపు కలవరపెట్టేలాగానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఏపీ పట్ల నిరాదరణ చూపిస్తున్న బీజేపీ ఇక మీదట తనదైన రాజకీయం కూడా మొదలుపెడితే జగన్ ఇబ్బందుల పాలు కావడం ఖాయమనే చెబుతున్నారు.
మున్ముందు తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికనే బీజేపీ సాధనంగా వాడబోతోందట. నిజానికి తిరుపతి ఉప ఎన్నిక కూడా సేమ్ దుబ్బాక మాదిరిగానే జరుగుతోంది. ఇక్కడ కూడా కరోనాతో సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించారు. ఆయన కుటుంబానికే జగన్ ఉప ఎన్నికలో టికెట్ ఇస్తున్నారు. పైగా వైసీపీ అన్ని అసెంబ్లీ సీట్లలోనూ బలంగానే ఉంది. కానీ బీజేపీ రాజకీయం ఏం చేస్తుంది.. ఎలా చేస్తుంది అన్నదే ఆసక్తికరమైన చర్చ.ఇక్కడ బీజేపీకి ఏ మాత్రం అనుకూలం అనిపించినా టీడీపీ లోపాయికారి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ తో తిరుపతి అగ్గి రాజుకుంటే జగన్ కి దుబ్బాక సీన్ కనిపిస్తుందనేది వాస్తవం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్