https://oktelugu.com/

అమరావతి కోసం నమో మోడీ అంటున్న బాబు..!

నేటితో అమరావతి ఉద్యమానికి 200రోజులు. ఈ సంధర్భంగా చంద్రబాబు నాయుడు మహా దీక్ష పేరుతో ఓ కార్యక్రమం చేపట్టారు. అమరావతి ఉద్యమంలో మరణించిన రైతులకు మరియు అల్లూరి సీతారామరాజు పటానికి పూలువేసి నివాళులు అర్పించారు. ఇక రాజధాని అమరావతిపై, ఆ ఉద్యమంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదన్న చంద్రబాబు, అమరావతిని కాపాడాల్సిన బాధ్యత మోడీపై ఉందని గుర్తు చేశారు. ఇక అమరావతి ప్రాజెక్ట్ దేశానికి సంపదను చేకూర్చే ఓ కల్పతరువుగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 4, 2020 / 07:13 PM IST
    Follow us on


    నేటితో అమరావతి ఉద్యమానికి 200రోజులు. ఈ సంధర్భంగా చంద్రబాబు నాయుడు మహా దీక్ష పేరుతో ఓ కార్యక్రమం చేపట్టారు. అమరావతి ఉద్యమంలో మరణించిన రైతులకు మరియు అల్లూరి సీతారామరాజు పటానికి పూలువేసి నివాళులు అర్పించారు. ఇక రాజధాని అమరావతిపై, ఆ ఉద్యమంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదన్న చంద్రబాబు, అమరావతిని కాపాడాల్సిన బాధ్యత మోడీపై ఉందని గుర్తు చేశారు. ఇక అమరావతి ప్రాజెక్ట్ దేశానికి సంపదను చేకూర్చే ఓ కల్పతరువుగా చెప్పడం విశేషం.

    ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్

    లోతుగా పరిశీలనా చేస్తే…అమరావతి ఉద్యమం బాబును రెండు ప్రాంతాల ప్రజలకు దూరం చేస్తుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అమరావతి ఉద్యమం నచ్చని అంశమే. అధికారం, అభివృద్ధి, సంపద అంతా ఒక ప్రాంతానికి పరిమితం కావడం మిగతా ప్రాంతాల వారికి ఎలా నచ్చుతుంది చెప్పండి. దీనివలన భవిష్యత్తులో బాబుకి పెద్ద సమస్యలే రావచ్చు. వచ్చే ఎన్నికలలో సైతం అమరావతి అంశం వైసీపీ కి ఆయుధంగా మారడం ఖాయం. మూడు రాజధానుల తమ నిర్ణయం, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా వారు గట్టిగా ప్రచారం చేసుకుంటారు అనడంలో సందేహం లేదు. దీని వలన వైసీపీ మహా అయితే గుంటూరు, కృష్ణ ప్రాంతాలలో సీట్లు కోల్పోవచ్చు. టీడీపీ మాత్రం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై పట్టుకోల్పోయే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలలో ఇదే ప్రధాన అంశం అవుతుంది.

    సీఎం జగన్ కు ఎంపీ రఘురామ స్పెషల్ రిక్వెస్ట్..!

    ఇంత పెద్ద రిస్క్ అమరావతి ఉద్యమంలో ఉంటే బాబు దానిని ఎందుకు వదిలేయడం లేదనేది అంతుబట్టని అంశం. అమరావతికి పునాది రాయివేసిన వాడిగా ఓ చారిత్రాత్మక ప్రాజెక్ట్ మరుగున పడిపోతుందనే ఆవేదన కావచ్చు. చంద్రబాబు అమరావతిని తప్పుడు ప్రచారాలతో చంపేయాలని చూస్తున్నారని అనడం బాధాకరం. రెండు నెలలుగా జరుగుతున్న అమరావతి పోరాటానికి ఆయన తన అధీనంలో ఉన్న వ్యవస్థల సాయంతో ఊపిరి పోస్తున్నాడు. ఐతే మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆపలేక పోయారు. శాసన మండలి రద్దయినా, మండలిలో టీడీపీ బలం తగ్గినా మూడు రాజధానుల బిల్లు పరుగులు పెడుతుంది. అందుకే బాబు మోడీపైనే ఆశలు పెట్టుకున్నాడు. ప్రత్యక్షంగా మోడీ జోక్యం చేసుకొని అమరావతిని కాపాడాలని, అమరావతి ఏర్పాటులో తమ హస్తం కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు మోడీపై తీవ్ర విమర్శలు చేసిన బాబు చివరి ఆశగా, మోడీని కలిసే ప్రయత్నం చేయవచ్చు. అలా జరిగితే మోడీ నిర్ణయం ఏమౌతుందనేది చూడాలి.