విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?

దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్నవేళ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందర్నీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కానీ కర్నాటక ప్రభుత్వం మాత్రం ఇందుకు ససేమిరా అన్నది పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు జూన్ 25 నుంచి జూలై 3 వరకూ జరిగాయి. ఐతే పరీక్షలు రాసిన వారిలో 32 మంది విద్యార్థులకు కరోనాపాజిటివ్ అని తేలడం ఇప్పుడు ఆందోళకరంగా మారింది. కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, జూన్ 25 మరియు […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 7:44 pm
Follow us on

దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్నవేళ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందర్నీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కానీ కర్నాటక ప్రభుత్వం మాత్రం ఇందుకు ససేమిరా అన్నది పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు జూన్ 25 నుంచి జూలై 3 వరకూ జరిగాయి. ఐతే పరీక్షలు రాసిన వారిలో 32 మంది విద్యార్థులకు కరోనాపాజిటివ్ అని తేలడం ఇప్పుడు ఆందోళకరంగా మారింది.

కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, జూన్ 25 మరియు జూలై 3 మధ్య పరీక్షలు రాసినవారిలో 32 మంది ఎస్‌ఎస్‌ఎల్‌సి విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. మరో ఎనభై మంది విద్యార్థులను హోంక్వారెంటైన్లో వుంచారు. ఈ పరీక్షలను 7.60 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 14,745 మంది హాజరు కాలేదు. 3,911 మంది విద్యార్థులు కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నందున పరీక్షలకు హాజరు కాలేదని ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అనారోగ్యంతో మొత్తం 863 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు.